Vishwakarma Puja 2022: ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న దేవశిల్పి విశ్వకర్మ పూజను జరుపుకుంటారు. ఈ పూజను ముఖ్యంగా ఫ్యాక్టరీలు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసేవారు జరుపుకుంటారు. ముఖ్యంగా వారి పనిముట్లను విశ్వకర్మ (Vishwakarma Puja 2022) ముందుంచి పూజలు చేస్తారు. విశ్వకర్మ ఇంద్రపురి, యమపురి, వరుణపురి, కుబేరపురి, పాండవపురి, సుదామపురి, శివపురి మొదలైన వాటిని సృష్టించాడని నమ్ముతారు. పుష్పక విమాన నిర్మాణం మరియు అన్ని రకాల దేవతల ఆయుధాలను ఇతనే తయారు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రహ్మ కమండలం, విష్ణువు యొక్క సుదర్శన చక్రం, శివుని త్రిశూలం మరియు యమరాజు యొక్క కాలదండ విశ్వకర్మచే సృష్టించబడ్డాయి. అందుకే అతన్ని దేవశిల్పి అని కూడా అంటారు.18 మంది వాస్తు శిల్పిల్లో విశ్వకర్మకు తొలి స్థానం లభించింది. ఈ రోజున విశ్వకర్మను పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 


ఇలా పూజించండి..
ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి..గంగాజలంతో ఆ ప్రదేశాన్ని కడగాలి. పసుపు గుడ్డపై స్వస్తిక గుర్తును వేయండి. అనంతరం గణేశుడిని పూజించండి. తర్వాత దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయండి. అంతేకాకుండా విశ్వకర్మ ముందు పనిముట్లను పెట్టి దీపం వెలిగించండి. పండ్లు, స్వీట్లు దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చివరగా హారతి ఇచ్చి...ప్రసాదం అందరికీ పంచిపెట్టండి. 


Also Read: Venus Transit: సెప్టెంబర్ 24న కన్యారాశిలోకి శుక్రుడు.. దీపావళికి ముందు ఈ 6 రాశుల ఆదాయం పెరగడం ఖాయం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook