Lukcy Girls Zodiac Sign: జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాల ప్రభావాలు అన్ని రాశుల వారి మీద ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ ప్రభావం ఒక్కోసారి శుభం కలిగేలా చేస్తే మరికొన్ని సార్లు మాత్రం అశుభాలు కలగడానికి కూడా కారణమవుతారు. శుభ ఫలితం కనుక ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చాలా మంచి స్థాయికి వెళతాడు, చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. అయితే ఆ ప్రభావం రాశులను బట్టి మారుతూ ఉంటుంది. అయితే డబ్బు పరంగా అదృష్టవంతులుగా పరిగణించబడే కొన్ని రాశులకు చెందిన అమ్మాయిల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. డబ్బు సంపాదించడంలో వారి అదృష్టం వారికి చాలా అనుకూలంగా ఉండడంతో వారిని ఎవరూ అందుకోలేనంత స్థాయికి వెళతారు. అలాంటి మూడు రాశులకు చెందిన అమ్మాయిల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం - జ్యోతిష్యం ఫలితాల ప్రకారం, వృషభ రాశి అమ్మాయిలు డబ్బులు చాలా తెలివిగా ఖర్చు చేస్తారట. వీరికి చిన్నప్పటి నుంచి డబ్బు మీద చాలా ఇష్టం ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఈ రాశి అమ్మాయిలు వ్యాపారంలో కనుక ఒక చేయి వేస్తే ఖచ్చితంగా మంచి విజయం సాధించి, పెద్ద వ్యాపారవేత్తలుగా మారి సత్తా చాటుతారట. వారి బ్రెయిన్ చాలా షార్ప్ అని అంటుంటారు. ఈ రాశిచక్రాన్ని శుక్రుడు పాలించే గ్రహం కావడంతో, వారు వ్యాపారంలో చాలా ముందుకు వెళతారని అంచనా. శుక్రుడు వ్యాపారానికి కారకుడిగా పరిగణించబడతారు. అంతే కాదు వారు వివాహం అయ్యాక కూడా తమ భాగస్వాములతో వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. లక్ష్మీ దేవి కూడా ఈ రాశి అమ్మాయిల మీద ప్రత్యేకించి ప్రేమ చూపుతారట. వివాహం తర్వాత, ఆమె తన భర్తకు కూడా అదృష్ట లక్ష్మీగా మారుతుంది. 


తులారాశి - ఈ రాశికి చెందిన అమ్మాయిలు వ్యాపార ఆలోచనాపరులుగా ఉంటారు.  డబ్బు సంపాదించడంలో అబ్బాయిల కంటే ఈ రాశి అమ్మాయిలు ముందుంటారని అంచనా. వీరి ముందు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం వెనుకంజ వేయడం కనిపిస్తూ ఉంటుంది. వీరిని పాలించే గ్రహం శుక్రుడు కావడంతో వారుకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పుట్టుకతోనే వస్తాయట. ఆమె మాట్లాడే విధానం ద్వారా అవతలి వ్యక్తిని ఆకట్టుకుంటుందట. 


మకరం - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి శని కావడం వలన శని దేవుడు  వారి మీద చాలా ప్రేమతో ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు స్వతహాగా చాలా కష్టపడి పనిచేసే వారుగా ఉంటారు. వారి శ్రమ ఆధారంగా, వారు వారి కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చాలా తక్కువ సమయంలోనే అందుకుంటారు. ఇక ఈ రాశికి చెందిన అమ్మాయిలు డబ్బుపై దృష్టి పెడతారు. డబ్బు సంపాదించడానికి వీరు కష్టపడి పని చేస్తారు. 


Also Read: Jupiter in Pisces Effect: గురుడి మీనరాశి ప్రవేశం, ఆ మూడు రాశులకు మరో మూడు నెలల వరకూ ఊహించని డబ్బు


Also Read: Astrology Telugu: నల్ల మిరియాలతో ఇలా చేస్తే.. ఆర్థిక పరమైన సమస్యలన్నీ తీరుతాయి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook