Wednesday Astro Tips: హిందూ గ్రంథాల్లో బుధవారం గణేశుడికి, దుర్గా మాతకు అంకితం చేయబడిన రోజుగా చెప్పబడింది. బుధవారం రోజున వినాయకుడిని, దుర్గాదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు దూరమవుతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం కొన్ని నియమాలు పాటించడం ద్వారా గణేశుడి అనుగ్రహం పొందవచ్చు. తద్వారా ఆ వ్యక్తి జాతకంలో బుధ గ్రహ స్థానం బలపడి కష్ట, నష్టాలు తొలగిపోతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం పాటించాల్సిన నియమాలు :


బుధవారం పెసరపప్పును దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకటిన్నర కిలోల పెసరపప్పును ఉడికించి.. దానికి నెయ్యి, పంచదార కలిపి ఆవుకు తినిపించాలి. 


ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి దాని పాదాలను తాకాలి. ఆ తర్వాత మీ మనస్సులో కోరికను చెప్పాలి. ఈ పరిహారాలతో గణేశుడు సంతోషించడమే కాక.. వీటిని పాటించేవారిపై అనుగ్రహం కురిపిస్తాడు.


నపుంసకులకు దానం :


జ్యోతిష్యం ప్రకారం బుధవారం నపుంసకుడికి కొంత డబ్బు, అలంకార సామగ్రిని దానం చేయాలి. అయితే నపంసకుడికి ఇచ్చే విరాళంలో ఒకటి లేదా రెండు రూపాయాలు వెనక్కి
తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారం ప్రభావవంతంగా ఉంటుంది. ఆ డబ్బును మీవద్ద భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ గ్రహ స్థానం బలపడుతుంది. తద్వారా ఆ వ్యక్తి ఆర్థికంగా పురోగతి చెందుతాడు.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Hemachandra Sravana Bhargavi Divorce: ఎట్టకేలకు నోరు విప్పిన హేమచంద్ర-శ్రావణ భార్గవి


Also Read: Udaipur  Beheaded Case: ఐదు రోజుల క్రితమే రక్షణ కోరిన టైలర్.. పట్టించుకోని పోలీసులు! ఉదయపూర్ హత్య కేసులో సంచలనం..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.