Wednesday Remedies: బుధవారం ఉపవాసం యెుక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజున గణేశుడిని ఎందుకు పూజిస్తారు?
Lord Ganesh: బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది మరియు ఈ రోజున వినాయకుడిని పూర్తి ఆచారాలతో పూజిస్తారు. దీనితో పాటు ఉపవాసం పాటించాలనే చట్టం కూడా ఉంది.
Wednesday Remedies: హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. ఈరోజు అనగా బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజున వినాయకుడిని (Lord Ganesh) పూజించటంతోపాటు కొంతమంది ఉపవాసం కూడా చేస్తారు. ఇవాళ ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి మరియు కీర్తి లభిస్తుందని నమ్ముతారు. ఏ శుభకార్యం జరిగిన ముందుగా గణేశుడిని పూజించటం హిందూ సంప్రదాయం. ఏడు బుధవారాలు ఉపవాసాలు చేయడం ద్వారా వారికి గణపతి ఆశీస్సులు లభిస్తాయి.
బుధవారం ఉపవాసం కథ
పౌరాణిక గ్రంథాల ప్రకారం, బుధవారం ఉపవాసం కథకు చాలా ప్రజాదరణ పొందింది. ఒకప్పుడు ధనవంతుడు మధుసూదన్ తన భార్యను తీసుకురావడానికి అత్తమామల ఇంటికి వెళ్లాడు. అక్కడే కొద్దిరోజులు ఉన్నాడు. తర్వాత తన ఇంటికి భార్యతో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు బుధవారం కావడంతో వెళ్లవద్దని అత్తగారు హెచ్చరించారు. ఆయన వారి మాట వినకుండా తన భార్యను వెంటబెట్టుకుని రథం పై వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లగానే అతడి భార్య బాగా దాహం వేసింది. మంచి నీళ్లు తెమ్మని భర్తను అడిగింది. మధుసూదన్ నీరు తేవడానికి వెళ్లాడు. ఆ నీటి వద్ద తనలాగే ఉన్న వ్యక్తిని చూశాడు మధుసూదన్. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు.
నువ్వెవరు? అని అవతలి వ్యక్తిని మధుసూదన్ ప్రశ్నించాడు. 'ఇదిగో భార్యను, అత్తమామలను వదిలిపెట్టి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను' అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పుడే కొందరు సైనికులు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అప్పుడు మధుసూధన్ భార్యను అడిగారు. 'చెప్పు, నీ అసలు భర్త ఎవరు?'ఇద్దరూ సరిగ్గా ఒకేలా ఉండటంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. 'అవివేకి, బుధవారమే వెళ్లి ఉండాల్సింది కాదు. నువ్వు ఎవరి మాట వినలేదు. ఈ లీల అంతా బుద్ధ భగవానుడిదే' అని పలికి ఆ స్వరం అదృశ్యమైంది. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధుడిని ప్రార్థించి, తన తప్పును క్షమించమని అడిగాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఇంటికి వచ్చాడు. దీని తరువాత, భార్యాభర్తలిద్దరూ నిబంధనల ప్రకారం ప్రతి బుధవారం ఉపవాసం ప్రారంభించారు. ఈ కథను చదివిన మరియు విన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతాడు.
Also Read: Sun Transit Effect: మిథునరాశిలో సూర్య సంచారం... ఈ రాశుల వారు జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook