COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weekly Horoscope Telugu: త్వరలోనే సెప్టెంబర్ మూడవ వారం ప్రారంభం కాబోతోంది. ఈ వారంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వారం మొదటి రోజున సూర్యుడు కన్యారాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కూడా కొన్ని రాశులవారికి శుభప్రదంగా మారబోతోంది. కాబట్టి ఈ సెప్టెంబర్‌ మూడవ వారం అన్ని రాశులవారికి ప్రయోజనకంగా మారుతందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వారం ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.



ఈ రాశులవారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతోంది:
మేషరాశి:

సెప్టెంబర్ మూడవ వారంలో సూర్యుడు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 


వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితిలు మరింత బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. సమాజం కోసం పని చేస్తున్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


సింహరాశి:
సూర్యుడి సంచారం కారణంగా సింహరాశి వారికి చాలా ఫలప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.అంతేకాకుండా ఈ సమయంలో ఆకస్మాత్తుగా డబ్బు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ వారం విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


ధనుస్సు రాశి:
ఈ వారం ధనుస్సు రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సూర్యుడి సంచారం కారణంగా ఎలాంటి పనులు ప్రారంభించిన మంచి లాభాలు పొందుతారు. కుంబంతో కూడా సంతోషంగా గడుపుతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook