Weekly Horoscope: ఈ 4 రాశుల వారికి డిసెంబర్ చివరి వారం హెచ్చుతగ్గులు..జాగ్రత్త సుమా..
Weekly Horoscope Telugu: ఈ వారం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని ప్రత్యేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Weekly Horoscope Telugu: గ్రహాలు సంచారం చేయడం కారణంగా మొత్తం అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. రాబోయే వారం కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆ వారం మొత్తం లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ డిసెంబర్ చివరి వారంలో మొత్తం 4 రాశులు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా 4 రాశులవారిపై ప్రత్యేక యోగాల ప్రభావం పడే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రాశులవారు ఊహించని ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు పొందే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేషరాశి:
ఈ వారం గ్రహాల సంచారం కారణంగా మేష రాశివారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలపుతున్నారు. దీంతో పాటు డబ్బుతో పాటు ఫిట్‌నెస్ పరంగా మంచి శుభవార్తలు వింటారు. ఇక వీరు విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే బిజీ బిజీగా కూడా ఉండొచ్చు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ఇంతక ముందు పెట్టిన పెట్టుబడులు లాభాల రూపంలో తిరిగి వస్తాయి.
వృషభరాశి:
వృషభ రాశివారు ఈ వారం తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వృత్తి పరంగా కూడా అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. దీంతో పాటు ఈ వారం యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో పెద్దలు చెప్పింది వినడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
సింహరాశి:
సింహ రాశి వారికి ఈ వారం ఒత్తిడి పెరిగి కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైనా తప్పు దోవ పట్టించవచ్చు కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సంపాదన విషయానికొస్తే..ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా డబ్బులు సంపాదిస్తారు. కానీ కొన్ని ఇబ్బందుల బారిన పడే అవకాశాలున్నాయి. దీంతోపాటు వివాహ సంబంధాలలో మార్పులు కూడా రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
మిథున రాశి:
డిసెంబర్ చివరివారం మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. గ్రహాల అనుకూలం కారణంగా డబ్బులు మరింత పొదుపు చేసే అవకాశాలున్నాయి. ఖర్చులు మొత్తం తగ్గి సంపాదన పెరుగుతుంది. ఈ వారం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతోపాటు మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి