Weekly Horoscope In Telugu: కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారాల కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అంతేకాకుండా గ్రహ సంచారాలు క్రమంలో మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే.. మరికొన్ని రాశుల వారు ఆర్థికంగా సామాజికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారం కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా ఈ వారం నుంచి వచ్చే వారం వరకు కొన్ని రాశుల వారికి మిశ్రమ ప్రయోజనాలు కలగబోతున్నాయి.  అంతేకాకుండా ఈ క్రమంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తలు కూడా పాటించాలి లేకపోతే తీవ్రంగా నష్టపోయా అవకాశాలు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరు కుటుంబంతో కలిసి శుభకార్యం లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం వీరు కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది లేకపోతే.. తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ క్రమంలో ఇష్టానికి విరుద్ధంగా మీ తోటి ఉద్యోగులు కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒత్తిడికి గురి కావడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు.


వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ వారం సహనం తగ్గుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. మీరు కూడా ఈ వారం కోపానికి దూరంగా ఉంటే చాలా మంచిది. లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక PhD చేస్తున్నవారు పరిశోధనల కోసం దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మీ కుటుంబం నుంచి మద్దతు లభించి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల మద్దతు లభించి పనిలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి.


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా మానసిక ప్రశాంతత పెరుగుతుంది అంతే కాకుండా ఈ వారం వీరికి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దీని కారణంగా చికాకు బావోద్వేగానికి గురవుతారు. ఈ వారం వీరికి కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారి విషయానికొస్తే.. పని ఒత్తిడి తగ్గి పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో వీరు బట్టలు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకు డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ పిల్లల విషయానికి వస్తే తప్పకుండా వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ వారం తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.


సింహరాశి:
సింహ రాశి వారికి కూడా ఈ వారం సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ క్రమంలో తల్లిదండ్రుల మద్దతు లభించి.. వృత్తి జీవితంలో అనేక లాభాలు కలుగుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారు స్థాన చలనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ పిల్లలనుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు. ఇక వీరికి ఈ క్రమంలో ఖర్చులు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ వారం సింహ రాశి వారు బట్టలు, నగలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారికి ఉన్నతాధికారుల మద్దతు లభించి ప్రమోషన్స్ కూడా పొందుతారు. ఈ సమయంలో రుచికరమైన ఆహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి