Weekly Horoscope 27 May to 2 June In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే కొత్త వారం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది మే చివరి రోజుల నుంచి జూన్ ప్రారంభ రోజులకు కలిపి ఉంటుంది. కాబట్టి ఈ వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా చతుర్ గ్రహీయోగం ఏర్పడబోతోంది. అలాగే వృషభరాశిలోనే జూన్ మొదటి వారంలో బుధుడు శుక్రుడు గృహస్పతి గ్రహాల కలయిక జరగబోతోంది. దీంతో ఎంతో శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగంతో పాటు బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అన్ని రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోందని ఉజ్వల భవిష్యత్తు రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ యోగాలు శుభ స్థానంలో ఉన్న కొన్ని రాశుల వారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఐదు రాశుల వారు జీవితానికి సంబంధించిన శుభవార్తలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో జ్యోతిష్యులు చెబుతున్నట్లు లాభాలు పొందబోయే రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


వృషభ రాశి: 
వృషభ రాశి వారికి ఈ కొత్త వారం ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన విషయంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా జీవితంలో కూడా అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు శక్తి సామర్థ్యాలను పొందుతారు. అలాగే ఇంతకుముందు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా జీవితంలోని కొత్త రోజులు ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతే కాకుండా ఈ సమయంలో వీరు కష్టపడి పనిచేయడం వల్ల మంచి లాభాలను పొందగలుగుతారు. 


మిధున రాశి: 
ఈ వారం మిధున రాశి వారు అనేక ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన విపరీతమైన తన లాభాలనుంది శక్తిని సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న పేదవారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక అంశంపై కూడా ఎంతో ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఈ వారం మిధున రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు కోపానికి గురయ్యే అవకాశాలున్నాయి. దీనికి కారణంగా వివిధ చిక్కుల్లో పడతారు. కాబట్టి కోపాన్ని ఎంత సులభంగా నియంత్రించుకుంటే అంత మంచిది. అలాగే ఉద్యోగాలు చేసేవారి కూడా అధికారులతో కొన్ని మాటలు పడే అవకాశాలున్నాయి. 


సింహరాశి: 
సింహ రాశి వారు ఈ వారం కొంత ఓపికతో ఉండాల్సి ఉంటుంది అలాగే కష్టపడి పని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో ఓపికతో కష్టపడి పని చేయాలి. దీంతో ఫలితాలను మీరే చూడగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి తమ తోటి ఉద్యోగుల సపోర్టు లభించి విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం పెరిగి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. 


తులారాశి: 
తులారాశి వారు ఇప్పటికే కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వారంలో వాటి నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. దీంతో పాటు జీవితంలో సానుకూలమైన మార్పులను చూడగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారు వ్యాపారాలు చేస్తున్నవారు మంచి లాభాలు పొందాలనుకుంటే తప్పకుండా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య కూడా సంబంధాలు మరింత మెరుగుపడతాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మీన రాశి:
ఈ వారం మీన రాశి వారికి ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేసిన డబ్బులు పొందగలుగుతారు. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలకు కూడా ఎంతో సులభంగా పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని సమస్యలు సులభంగా తొలగిపోతాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి