Diwali Sentiments: దీపాల ఆవళి దీపావళి వచ్చేస్తోంది. నరకుడనే రాక్షసుడి సంహారంతో చీకటి పోయి వెలుగొచ్చిందనే నమ్మకంతో జరుపుకునే వైభవమైన పండుగ. అయితే దీపావళి నాడు కొన్ని రకాల పక్షుల్ని చూస్తే శుభం జరుగుతుందట. ఆ పక్షులు లేదా జంతువులేంటనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళి నాడు లక్ష్మీదేవి(Lakshmi Devi) పుట్టినరోజుగా భావిస్తారు. ఉత్తరాదిన అయితే దీపావళి పెద్ద పండుగ. ప్రతి ఇంట్లో ఐదు రోజుల పాటు జరిగే వైభవమైన పండుగ. దక్షిణాదిన దీపావళి సాధారణంగా ఒక్కరోజులోనే ముగిసిపోతుంది. ఒకరోజైనా, ఐదు రోజులైనా సరే పూజించేది మాత్రం లక్ష్మీదేవినే. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి ఇంటికొస్తుందనేది ప్రగాఢ నమ్మకం. అందుకే ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తారు. అత్యంత వైభవంగా పూజలు చేస్తారు. దీపావళి నాడు కొన్ని రకాల జంతువులు లేదా పక్షులు కన్పిస్తే వాస్తవ నమ్మకానికి విరుద్ధంగా శుభం కలుగుతుందనేది ప్రతీతి. అలా దీపావళి నాడు ఆ పక్షులు లేదా జంతువుల్ని చూస్తే ఏడాది పొడుగునా ఆర్ధిక సమస్యలుండవని అంటారు. ఎందుకంటే దీపావళికు సంబంధించి పురాణాల ప్రకారం కొన్ని ప్రత్యేక నమ్మకాలు (Diwali Sentiments)బలంగా ఉన్నాయి.


దీపావళి (Diwali)రోజు రాత్రి కొన్ని అరుదైన జీవాలు కన్పిస్తే లక్ష్మీదేవి రాకకు సూచనగా భావిస్తారు. ఫలితంగా ఏడాది మొత్తం ఆనందం, శ్రేయస్సు ఇంట్లో ఉంటుందనేది నమ్మకం. సంపద లభిస్తుందని అంటారు. ముఖ్యంగా గుడ్లగూబను దీపావళి నాడు చూస్తే శుభప్రదంగా భావిస్తారు. గుడ్లగూడ లక్ష్మీదేవి వాహనమని భావన. అందుకే గుడ్లగూబను చూస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. ఇక దీపావళి రాత్రి పుట్టుమచ్చలు చూడటం కూడా శుభప్రదమే. అలా చేస్తే ఇంట్లో డబ్బుకు లోటుండదని చెబుతారు. 


సాధారణంగా పిల్లి లేదా బల్లిని చూస్తే హిందూ సంప్రదాయం ప్రకారం అశుభంగా భావిస్తారు. కానీ దీపావళి రాత్రి పిల్లిని చూస్తే శుభప్రదం. దీపావళి పూజ తరువాత ఇంట్లో లేదా సమీపంలో పిల్లి కన్పిస్తే లక్ష్మీదేవి రాకకు సూచన అంటారు. ఆ రోజు పిల్లిని చూస్తే ఇంట్లో లక్ష్మీదేవి సంతోషం ప్రాప్తిస్తుందట. ఇక బల్లి కన్పిస్తే సాధారణంగా తరిమికొడతాం. కానీ శకునాల ప్రకారమైతే దీపావళి రాత్రి బల్లి కన్పిస్తే శుభప్రదమట. అలా కన్పిస్తే ఇంటికి ఆనందం, సంపద వస్తుందట. మీరు కూడా ఆ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి.


Also read: Navratri 2021: దేవీ నవరాత్రు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook


ల ఉపవాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి