Ugadi 2024 Date and Time: తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రపంచమంతా ఆంగ్ల క్యాలెండర్‌ అనుసరిస్తుండగా మన తెలుగు క్యాలెండర్‌ భిన్నమైనది. మన తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది. కొన్ని రోజుల్లో క్రోది నామ సంవత్సర తెలుగు సంవత్సరం ఉగాది రాబోతున్నది. అయితే ఉగాది ఏ రోజు వచ్చింది? ఆరోజు ఏం చేసుకోవాలి? ఏ టైమ్‌లో ఏయే కార్యక్రమాలు చేసుకోవాలనేది పంచాంగ నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ex CM KCR Horoscope: క్రోధీ నామ సంవత్సరంలో కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది.. మరోసారి చక్రం తిప్పేనా.. ?


 


ప్రతి సంవత్సరం మాదిరి ఈ యేడాది కూడా ఉగాది పండుగపై గందరగోళం ఏర్పడింది. పండుగ ఏ రోజు చేసుకోవాలనే దానిపై పండితులు స్పష్టత ఇచ్చారు. సోమవారం అమావాస్య ఉన్న విషయం తెలిసిందే. సోమవారం పండుగ చేసుకోలేరు. అయితే మంగళవారం రావడంతో పండుగ ఆరోజు చేసుకోవాలా లేదా అనే దానికి స్పష్టత ఇచ్చారు. అమావాస్య ముగిసిన తెల్లవారితే మంగళవారం అనగా 9వ తేదీ ఉగాది పండుగ చేసుకోవచ్చు. ఆరోజు పండుగ ఎలా చేసుకోవాలో అని కొన్ని సూచనలు ఇచ్చారు.

Also Read: Ugadi Festival History 2024: ఉగాది పండగ ఎప్పుడు, ఎలా పుట్టింది?.. ముందు ఎవరు జరుపుకున్నారు?


ఉగాది రోజు ఇవి చేయాలి


  • ఉదయం 3 నుంచి 5 గంటలలోగా తైల అభ్యంగన స్నానం చేయాలి. 

  • అనంతరం కొత్త బట్టలు ధరించి ఏరువాక చేయుటకు శుభయుక్తం.

  • మంగళవారం ఉగాది తెలుగు సంవత్సరాది ఉదయం 5 నుంచి 7:45 నిమిషాలు లోగా షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడి సేవించాలి.

  • ఉదయం 7:15 నిమిషాలకు రేవతి నక్షత్ర మేష లగ్నమున ఉదయం 11:34 నిమిషాలకు అశ్వని నక్షత్ర మిథున లగ్నమున చిట్ట, ఆవర్జాలకు, కొత్త పుస్తకాలు, బెల్లం, పంచదార పసుపు, బంగారం, వెండి రత్నములు క్రయవిక్రయాలు వ్యాపారం చేయవచ్చు. 

  • ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన వస్తు సామగ్రి, సరుకులు బోణీ వేయుటకు క్రయవిక్రయాలు చేయవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి