Diwali 2023: దీపావళి ఎప్పుడు..ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు..గోవర్ధన పూజ తేదీ, నరక చతుర్దశి ప్రత్యేక సమయం..
Diwali 2023: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీల్లో గందరగోళం నెలకొనడంతో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. ఈ సంవత్సరం ఏయే తేదీల్లో దీపావళి పండుగను జరుపుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Diwali 2023: హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలు దీపావళి పండగ ఒకటి. ప్రతి సంవత్సరం ఈ పండగను కార్తీకమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా పురాణాల ప్రకారం ఇదే రోజు శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుని సంహరించి ఇంటికి తిరిగి వచ్చాడని చెప్పుకుంటారు. శ్రీరాముడు 14 సంవత్సరాల తర్వాత అయోధ్య నగరానికి తిరిగి రావడంతో అక్కడి ప్రజలు ఎంతో ఆనందంతో దీపావళి పండుగను జరుపుకున్నారని పురాణాల్లో పేర్కొన్నారు.
అప్పటినుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండగను జరుపుకుంటూనే వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ పండగను ఘనంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీల్లో మార్పులు రావడంతో తేదీల్లో గందరగోళం నెలకొంది. దీపావళి పండగ ఈ సంవత్సరం ఏయే తేదీల్లో జరుపుకోవడం శ్రేయస్కరం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పండగ ఏ రోజు జరుపుకోవాలి?:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం నవంబర్ 12వ తేదీన అమావాస్య తిథి ప్రారంభం కాబోతోంది. ఈ తిథి మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు ముగుస్తుంది. ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలనుకునేవారు అమ్మవారికి ప్రదోషకాలంలో ఉపవాసాలు, పూజలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో లక్ష్మీదేవి పూజతో పాటు గణేశుడి పూజను కూడా చేయడం శుభప్రదం.
ధన్ తేరాస్ ఎప్పుడంటే:
ప్రతి సంవత్సరం లాగే దీపావళి పండుగకి రెండు రోజుల ముందు ధన్ తేరాస్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన జరుపుకోవడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
నరక చతుర్దశి:
ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
గోవర్ధన పూజ:
ప్రతి సంవత్సరం గోవర్ధన పూజను దీపావళి జరుపుకున్న తర్వాత మరుసటి రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూజను కార్తీక మాసం రోజున జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. తిథుల ప్రకారం నవంబర్ 14వ తేదీన గోవర్ధన జరుపుకోవడం చాలా శ్రేయస్కరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.