Raksha bandhan 2023: ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడు? రాఖీ ఏ సమయంలో కట్టాలి?
Rakhi Festival 2023: కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగలలో రక్షాబంధన్ ఒకటి. వచ్చే నెలలో ఈ పండుగను జరుపుకునేందుకు దేశమెుత్తం ముస్తాబైంది. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది, దాని శుభ సమయం తెలుసుకోండి.
Raksha bandhan 2023 date: దేశవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రక్షాబంధన్ ఒకటి. సోదరసోదరీమణులు ప్రేమకు ప్రతీకగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. దీనినే రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఈ వేడుకను శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రక్షాబంధన్ నాడు రాఖీని శుభ ముహూర్తంలో మాత్రమే కట్టాలి, లేకుంటే అశుభ ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం ఈ పండుగ ఎప్పుడు వచ్చింది, రాఖీ కట్టడానికి శుభ సమయం ఎప్పుడు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
రాఖీ కట్టడానికి శుభ సమయం
సాధారణంగా ఏ శుభ కార్యమైనా శుభ ముహూర్తంలో చేస్తేనే విజయవంతమవుతుంది. అలాగే రాఖీని కూడా మంచి ముహూర్తంలో కట్టడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ ఏడాది పౌర్ణమి ఆగస్టు 30, ఉదయం 10:59 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31న ఉదయం 07:06 గంటలకు ముగుస్తుంది. ఇది భద్రకాలంలో వచ్చింది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. మీరు రాఖీ కట్టడానికి శుభ సమయం ఆగస్టు 30వ తేదీ రాత్రి 09:02 నుండి ఆగస్టు 31వ తేదీ ఉదయం 07:06 గంటల వరకు.
Also Read: Vakri Guru 2023: గురు తిరోగమనం వల్ల ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది.. మీరున్నారా?
భద్ర కాలం తెలుసుకోండి..
హిందూ శాస్త్రం ప్రకారం, భద్ర సమయం అనేది అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో రాఖీ కట్టడం, పూజలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, గృహ ప్రవేశాలు, ముండనం వంటి ఏ పనులు చేయరు. ఒకవేళ చేస్తే మీరు అశుభ ఫలితాలను పొందుతారు. వాస్తవానికి రావణుడి చెల్లెలు శూర్పణఖ భద్రకాలంలో రాఖీ కట్టడం వల్లే హతమవుతాడు. సూర్యుదేవుడు, ఛాయల కుమార్తె భద్ర. శనిదేవుడి సొంత చెల్లెలు. శని ఏవిధంగా కఠినంగా, కోపిష్టిగా ఉంటాడో అదే విధంగా చెల్లెలు భద్ర కూడా ఆ స్వభావాన్నే కలిగి ఉంటుంది. బాల్యం నుంచే రుషులు, మునుల యజ్ఞాదికార్యక్రమాల్లో ఆటంకం కల్గించేది.
Also Read: Venus Reverse Movement: తిరోగమనంలోకి వెళ్లబోతున్న శుక్రుడు.. ఈ 4 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook