Makar Sankranti 2023 Date: తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ పండుగ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలువబడుతుంది. దీనిని తమిళనాడులో పొంగల్, గుజరాత్ లో 'ఉత్తరాయణం' అని, పంజాబ్ లో లోహ్రి, అసోంలో బిహు, కేరళలో ఓనం పేరుతో ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ ఫెస్టివల్ ను మకర సంక్రాంతి అని అంటారు. 2023లో సంక్రాంతిని (Sankranti 2023) జనవరి 15న జరుపుకోనున్నారు. ఇది నాలుగు రోజులపాటు జరిగే వేడుక. మెుదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగు రోజు ముక్కనుమ జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సూర్యుడి ఏ రాశిలో సంచరిస్తే దానిని సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతుల్లో మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఉంది. ఈ పండుగను మన తెలుగు ప్రజలు 'పెద్దల పండుగ' అని పిలుస్తారు. సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. .మార్గశిరం పూర్తి కాగానే మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. భీష్ముడు ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు. సంక్రాంతి పండుగను ఒరియా నూతన సంవత్సరం గానూ... బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ జరుపుకుంటారు. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో 'వైశాఖి' అనే పేరుతో పిలుస్తారు. 


Also Read: Mars transit 2023: కొత్త సంవత్సరంలో మార్స్ మార్గి... వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.