Kali Controversy: మహాకాళి గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు?
Kali Story: రాక్షసులను నాశనం చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి పార్వతిదేవియే కాళీమాతగా అవతరించింది. ఈ దేవత యెుక్క జన్మవృత్తాంతం తదితర విషయాలు గురించి తెలుసుకుందాం.
Kali Controversy: ఇటీవల దేశవ్యాప్తంగా కాళీ పోస్టర్ (Kali Poster) ఎంత వివాదస్పదమైందో మీ అందరికీ తెలిసిందే. ఇందులో నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకోగా, మరో చేత్తో సిగరేట్ తాగుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై పలు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాళీమాత జన్మవృత్తాంతం తదితర విషయాలు తెలుసుకుందాం.
కాళీమాత వృత్తాంతం:
పార్వతి దేవి యెుక్క ఉగ్రరూపమే కాళీమాత లేదా మహాకాళి లేదా మహంకాళి. శివుని రుద్రావతారమైన మహాకాళుని భార్య. వాస్తవానికి పురాతన ఆలయాలలో కాళీమాత లేదా మహాకాళుడు ఇద్దరనీ నిరాకార రూపంలో పూజిస్తారు. ధర్మాన్ని రక్షించడానికి మరియు అసురులను నాశనం చేయడానికి మహాకాళి జన్మించింది. కాళికాదేవి.. మహిషాసుర, చంద్ మరియు ముండా, ధమ్రాక్ష్, రక్తబీజ్ మొదలైన అనేక మంది రాక్షసులను చంపింది. మహాకాళి ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకునే దేవత. ఈ దేవతను ముఖ్యంగా గిరిజనులు పూజిస్తారు. ఈమెకు మాంసం, చేపలు, వైన్ వంటివి సమర్పిస్తారు. నవరాత్రులు వంటి సమయాల్లో మహాకాళికి బలి ఇచ్చే ఆచారం కూడా గిరిజనుల్లో ఉంది.
ఏయే ప్రాంతాల్లో కాళీమాతను పూజిస్తారు?
పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, ఒడిశా మరియు బంగ్లాదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో మహాకాళిని (Goddess Maha kali) ఎక్కువగా పూజిస్తారు. తాంత్రికులు కూడా శక్తులు పొందడానికి కాళీమాతను పూజిస్తారు. తంత్ర గ్రంథాలలో కాళీ యెుక్క 9 రూపాలు గురించి చెప్పబడ్డాయి. అవి కాళి, దక్షిణకాళి, ఉగ్రకాళి, స్మషన్ కాళి, కమకలకలి, కంకళి, రక్త కాళి, శ్యామకాళి మరియు వామ కాళి. అంతేకాకుండా దశ మహావిద్యలలో మొదటి మహావిద్య కాళీ. ఉజ్జయినిలో మహంకాళి ఉత్సవాలు జరుపుతారు.
కాళీ మాత పాదాల కింద శివుడు ఎక్కువగా ఉన్న పోస్టర్ మన ఎక్కువగా చూసుంటాం. పార్వతీదేవి రక్తబీజ్ రాక్షసుడిని చంపడానికి కాళీ అవతారం ఎత్తింది. యుద్దంలో రక్తబీజ్‌ని చంపింది. అయితే రాక్షస సంహారం తర్వాత కూడా పార్వతీమాత కోపం చల్లారకపోవడంతో దేవతల పిలుపు మేరకు శివుడు కాళిని ఎదుర్కొంటాడు. కాళీమాత పరమేశ్వరుడిపై కాలుమోపగానే శాంతిస్తుంది.
Also Read; Som Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook