Yogini Ekadashi 2023: ఏకాదశి తిథులకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ శ్రీమహా విష్ణువును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ప్రతి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. కాబట్టి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఇది ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై మాసంలో వస్తుంది. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం యోగిని ఏకాదశి వ్రతం జూన్ 14(ఈ రోజు) వచ్చింది. అయితే ఈ రోజు ఎలాంటి నియమాలతో వ్రతాన్న చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందా.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యోగిని ఏకాదశి వ్రత ముఖ్యత:


నిర్జల ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్మకం. చాలా మంది ఈ రోజు అన్నదానం కార్యక్రమాలు కూడా చేస్తారు. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


యోగిని ఏకాదశి శుభ ముహూర్తం 2023:
ఏకాదశి తిథి ప్రారంభం: 13 జూన్, ఉదయం 09:28 గంటలకు..
ఏకాదశి తిథి ముగుస్తుంది: జూన్ 14, ఉదయం 08:48 గంటలకు..


యోగినీ ఏకాదశి పూజా విధానం:
✵ ఉపవాసం పాటించాలనుకునేవారు ఉదయాన్నే లేచి తల స్నానం చేయాల్సి ఉంటుంది.
✵ ఆ తర్వాత పట్టు వస్త్రాలను ధరించి ఇంట్లో దేవుని ఫోటోల దీపం వెలిగించాలి. 
✵ గంగాజలంతో విష్ణువు అభిషేకం చేయాల్సి ఉంటుంది.
✵ పూజా ప్రారంభించే ముందు, విష్ణుమూర్తికి పూలు, తులసి ఆకులను సమర్పించాలి.
✵ ఈ వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది.
✵ ఇలా పూజలో భాగంగా స్వామివారికి తీపి పదార్థాలతో తయారు చేసిన నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది.
✵ ఆ తర్వాత తులసి ఆకులతో అల్లిన మాలను విష్ణు మూర్తి మెడలో వేయాలి.
✵ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత దానధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి