హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ప్రాధాన్యత, మహత్యం చాలా ఎక్కువ. గ్రహాలు, నక్షత్రాలు, రాశుల కదలిక ఆధారంగా వివిధ వ్యక్తుల జ్యోతిష్యం ఎలా ఉంది, జాతకం ఎలా ఉంటుంది, స్వభావం ఎలా ఉంటుందనే వివరాలను జ్యోతిష్య పండితులు చెప్పగలుగుతారు. ముఖ్యంగా ఐదు రాశులవారి విషయంలో జ్యోతిష్యశాస్త్రంలో విశేషంగా ప్రస్తావన ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా ఐదు రాశుల జాతకులు డబ్బును వృధాగా ఖర్చుపెట్టే గుణం కలిగినవారు. లగ్జరీగా బతికేందుకు, అనుకున్న కోర్కెలు సాధించుకునేందుకు ఎందాకైనా వెళ్లే రకమట ఈ ఐదు రాశులవాళ్లు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టేస్తారట. ఆ వ్యక్తులకున్న ఈ అలవాటే ఎక్కువ డబ్బు సంపాదించేందుకు కూడా ప్రేరేపిస్తుందట. ఎంత సంపాదించినా వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఏం మిగిల్చుకోలేరని శాస్త్రం చెబుతోంది. 


వృషభరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు లగ్జరీ లైఫ్, భౌతిక సుఖాలకు కారణమైన గ్రహంగా చెబుతారు. శుక్రుని ప్రభావంతో వృషభరాశి వ్యక్తులకు లగ్జరీగా ఉండటం ఇష్టం. ఈ జాతకులకు ఎప్పుడూ బెస్ట్ క్వాలిటీ వస్తువులే ఇష్టమట. అందుకే ఏదైనా వస్తువు కొనేముందు బడ్జెట్ చూడరు. ఎంత ధరైనా వెనుకా ముందూ ఆలోచించరు. విశేషమేమంటే ఈ రాశి జాతకులు తెలివితేటలు, శ్రమతో ఎక్కువ డబ్బులు కూడా సంపాదిస్తుంటారు.


మిధున రాశి జాతకులు ఎక్కువగా ఖర్చుపెట్టేవాళ్లే. స్నేహితుల కోసం కూడా ఎక్కువ డబ్బులు ఖర్చుపెడుతుంటారు. గొప్పల కోసం కూడా డబ్బులు వృధాగా ఖర్చుపెడుతుంటారు. అందుకే ఈ రాశివారి దగ్గర డబ్బులు నిలబడవు. 


సింహరాశి జాతకులకు లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. వీరి కోర్కెలు కూడా చాలా ఖరీదుగానే ఉంటాయి. ఎక్కువ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. ఎప్పుడూ కొంతమంది జనాన్ని వెంటేసుకునే ఉంటారు. తమకోసమే కాకుండా ఇతరుల కోసం కూడా భారీగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. 


తుల రాశికి కూడా అధిపతి శుక్రుడే. అందుకే లగ్జరీ లైఫ్ ఇష్టపడుతుంటారు. అయితే గొప్ప విషయమేమంటే సొంతానికి కాకుండా ఇతరుల సహాయం కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. అవసరమైన ఆపన్నులకు సహాయం కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమౌతారు. ఇతరులకు సహాయం చేసేందుకు అవసరమైతే అప్పు కూడా చేస్తారు. 


కుంభరాశి అధిపతి శని. వీరిలో ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువ. దాంతోపాటు షోయింగ్ కూడా చేస్తుంటారు. ఈ రెండు గుణాల వల్ల ఈ జాతకుల వద్ద డబ్బు నిలబడదు. డబ్పులు వచ్చిన వెంటనే ఖర్చు పెట్టేస్తారు. 


Also read: Mangal Gochar 2022: మరో 6 రోజుల్లో మిథునంలోకి కుజుడు.. మేషరాశిపై ఎలాంటి ప్రభావమో చూడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook