Cyber Crime: ఆన్‌లైన్‌ గేమ్‌లు.. ఆన్‌లైన్‌ యాప్‌లతో అప్రమత్తంగా ఉండకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గుర్తింపు లేని యాప్‌లతో లావాదేవీలు చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలో చోటుచేసుకుంది. గేమింగ్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో పోరాడుతూ చనిపోయాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: క్యాంపస్ లో ఘోరం.. ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై 9 సార్లు కత్తిపోట్లు.. వీడియో వైరల్..


నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మోతే నాగరాజు (19) ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడడం అలవాటు. తన మొబైల్ ఫోన్లో ఒక ఆన్‌లైన్ గేమింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఆట ఆడుతున్నాడు. గుర్తు తెలియని యాప్‌ కావడంతో సైబర్‌ నేరగాళ్లు దీన్ని అస్త్రంగా చేసుకున్నారు. నాగరాజుకు ఫోన్ చేసి నిషేధిత యాప్ డౌన్‌లోడ్ ఎందుకు చేసుకున్నావ్ అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. పదేపదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగడంతో నాగరాజు భయపడ్డాడు.

Also Read: Free Fire Dispute: ఆన్‌లైన్‌ గేమ్‌లో అమ్మాయితో గొడవ.. కారు తగలబెట్టిన యువకుడు


తాము సీబీఐ అధికారులమని చెప్పి నాగరాజుతో రూ.ఐదు లక్షలు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులకు అతడు తాళలేకపోయాడు. ఏం చేయాలో తెలియక.. ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వేధింపులు తాళలేక తనలో తాను భయాందోళన చెందుతూ ఈనెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


చికిత్స పొందుతున్న నాగరాజు పరిస్థితి శనివారం మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సైబర్‌ నేరగాళ్ల వేధింపులకు తమ అబ్బాయి మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ యాక్టింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడిన వారెవరో పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఆర్మూర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


అప్రమత్తం అవసరం
నిషేధిత యాప్‌లు, గుర్తింపు లేని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే సైబర్‌ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లు ఆడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గేమ్‌ల ద్వారా పరిచయాలు చేసుకుని కూడా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తత పాటిస్తే ప్రమాదాలను ముందే నియంత్రించవచ్చని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter