శ్రీలంకపై  టీమిండియా అలవోకగ నెగ్గింది. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని  ప్రదర్శించిన భారత్‌.. లంకను మరింత నిర్దాక్షిణ్యంగా ఓడించింది.వివరాల్లోకి వెళ్లినట్లయితే ..తొలి టి 20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 180 పరుగుల భారీ స్కోరు చేసింది.  కేఎల్‌ రాహుల్‌ (61) ధోని (39 నాటౌట్), మనీష్‌ పాండే (32 నాటౌట్) రాణించడంతో భారీ స్కోరు సాధ్యపడింది.


కాగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు ప్రత్యర్థి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి నిలబడలేక 87 పరుగులకే లంక ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు మరోమారు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. యువ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (4 వికెట్లు) తన స్పిన్ మాయాజాలంతో లంక పతనాన్ని శాసిండంలో కీలక పాత్రపోషించాడు. ఇదిలా ఉండగా  ఈ సిరీస్ లొ శ్రీలంకతో మరో రెండు మ్యాచ్ లో టీమిండియా ఆడాల్సిఉంది.