T20 Mens World Cup 2024 Host Country: టీ20 వరల్డ్ కప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ నిర్వహించే బాధ్యతను ఐసీసీ ఈ రెండు దేశాలకు గతంలో అప్పగించింది. అయితే తాజాగా ఆతిథ్య వేదిక మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అమెరికా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. ఇంగ్లాండ్‌లో నిర్వహించే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ 2024‌ను అమెరికా, వెస్టిండీస్‌లో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఐసీసీ గతేడాది అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటి నుంచే పిచ్‌లు.. గ్రౌండ్‌లు, స్టేడియాలు సిద్ధం చేసుకోవాలని అవసరం ఉంది. అయితే అమెరికాలో ఈ మెగా టోర్నమెంట్ కోసం మౌలిక సదుపాయాలు ఇంకా సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే టీ20 వరల్డ్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ఇంగ్లాండ్‌ను ఐసీసీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024తో పాటు 2030 టీ20 ప్రపంచ కప్ వేదికలు మారవచ్చని ప్రచారం జరుగుతోంది. 2030 టీ20 ప్రపంచ కప్ కోసం ఆతిథ్య హక్కులను ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ దేశాలు పొందాయి. మూడు దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి.


2024 వరల్డ్ కప్ ఆతిథ్యంతోపాటు టోర్నీకి నేరుగా అమెరికన్ క్రికెట్ జట్టు అర్హత సాధించింది. అయితే ఆతిథ్య హక్కులు పోతే.. టీ20 ప్రపంచ కప్ 2024 నుంచి ఔట్ అయ్యే అవకాశం ఉంటుంది. అమెరికా క్రికెట్ జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననుంది. ఈసారి టీ20 ప్రపంచకప్ సరికొత్త ఫార్మాట్‌లో జరగనుంది. 2021, 2022 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్ తరువాత సూపర్ 12 స్టేజ్ కింద టోర్నమెంట్ నిర్వహించారు. 


Also Read: Namibia Squad: నమీబియా తరఫున ఆడనున్న డుప్లెసిస్, డివిలియర్స్.. జట్టులో పేర్లు ప్రకటన..!  


కానీ ఈసారి వరల్డ్ కప్‌లో జట్లను రెండు గ్రూపులకు బదులుగా నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఇందులో నుంచి నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. రెండు సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌లో అడుగుపెడతాయి. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టును ఓడించి రెండోసారి పొట్టి కప్‌ను ముద్దాడింది.


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook