India vs West Indies: రేపు(సోమవారం) విండీస్, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. వార్నర్ పార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈమ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచి టీమిండియా మంచి ఊపు మీద ఉంది. రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని భారత జట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త తడబడినా..బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, దినేష్‌ కార్తీక్ మెరుపులు మెరిపించడంతో భారీ స్కోర్ సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. బౌలింగ్‌లో మాత్రం టీమిండియా అలరించింది. తక్కువ స్కోర్‌కే వెస్టిండీస్‌ను కట్టడి చేసింది. దీంతో రెండో టీ20లోనూ టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది. జడేజా, అశ్విన్ రాకతో ఆల్‌రౌండర్ల కోటా ఫుల్‌గా ఉంది. టాప్‌, మిడిల్ ఆర్డర్ సైతం సీనియర్లు, యువ ఆటగాళ్ల సమంగా ఉంది. రెండో మ్యాచ్‌లో గెలిచి టీ20ల్లో జైత్రయాత్ర కొనసాగించాలని రోహిత్ సేన స్కెచ్‌లు వేస్తోంది.


ఇటు విండీస్‌ సైతం కసితో ఉంది. ఈమ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఐదు టీ20ల సిరీస్‌ను దక్కించుకోవాలని విండీస్‌ యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈక్రమంలో రెండో మ్యాచ్‌లో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. వార్నర్ పార్క్ స్టేడియం బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుందని క్యూరేటర్లు చెబుతున్నారు. దీంతో రెండో టీ20 మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 



టీమిండియా జట్టు..


రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్‌ పంత్(కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్‌ కార్తీక్, రవిచంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్


Also read:CP CV Anand: డయల్ 100కు కాల్ చేసిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్..అసలేమి జరిగింది..!


Also read:Palnadu: పల్నాడు జిల్లాలో పరువు హత్య కలకలం..కొడుకును చంపిన తల్లిదండ్రులు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook