Virat Kohli's anniversary post for Anushka Sharma: నేడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohl), బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)ల పెళ్లి రోజు. విరుష్క జోడి వివాహ బంధంలోకి అడుగుపెట్టి శనివారంకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన సతీమణి అనుష్కకు విరాట్ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు. భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసి.. తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఈ నాలుగేళ్లలో నా సిల్లీ జోక్‌లను భరించావ్.. ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావ్ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఈ నాలుగేళ్లలో నేను వేసిన సిల్లీ జోక్‌లను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా.. ప్రేమించావు. నాలుగు సంవత్సరాలుగా దేవుడి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మన వివాహ జీవితంలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. నన్ను మంచి వైపు నిలబడేలా స్ఫూర్తి నింపావు. నీతో పెళ్లయి ఈ నాలుగేళ్లలో నన్ను అన్నివిధాలుగా మార్చివేశావు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. కుటుంబంగా ఇది మొదటి వార్షికోత్సవం. మన జీవితంలో వామిక రావడంతో జీవితం పరిపూర్ణమైంది' అని విరాట్ కోహ్లీ (Virat Kohl) వరుస ట్వీట్లు చేశాడు.


Also Read: Virat Kohli ODI captaincy: విరాట్ కోహ్లీ ఫోన్‌ స్విఛ్చాఫ్‌లో ఉంది.. కారణం ఏంటో తెలియదు: కోచ్


అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli - Anushka Sharma) ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకున్నారు. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నా.. ఎంతో గోప్యత పాటించారు. చివరకు 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2020 ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. ఈ ఏడాది జనవరి 11న అనుష్క వామిక (Vamika )కు జన్మనిచ్చారు. పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించారు.




వివాహం అనంతరం అనుష్క శర్మ (Anushka Sharma) సినిమాలకు దూరం కాగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం క్రికెట్ ఆటతో బిజీ అయిపోయాడు. కోహ్లీ ఏ దేశంలో మ్యాచ్‌లు ఆడినా అనుష్క అక్కడికే వెళ్లిపోతుంటుంది. ఐపీఎల్‌ 2021, టీ20 ప్రపంచకప్ 2021 యూఏఈలో జరగ్గా.. అక్కడికి కూడా అనుష్క వెళ్లారు. అనుష్క చివరి సారిగా 2018లో 'జీరో' సినిమాలో నటించారు. ఇటీవల నిర్మాతగా మారిన అనుష్క.. పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మరోవైపు కోహ్లీ స్థానంలో భారత వన్డే, టీ20 జట్లకు సారథిగా రోహిత్‌ శర్మ నియమితులయ్యాడు. ఇక నుంచి టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే కోహ్లీ నాయకత్వం వహిస్తాడు.


Also Read: Video: సారా అలీ ఖాన్ లేటెస్ట్ సాంగ్‌కి ఎయిర్ హోస్టెస్ అదిరిపోయే స్టెప్పులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook