Aakash Chopra says I was surprised by Mohammed Shami coming out to bowl final over: టీ20 ప్రపంచకప్‌ 2022 ముంగిట ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా ఆడని పేసర్‌ మహమ్మద్‌ షమీ.. ఫైనల్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. చివరి నాలుగు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సమయంలో ఒక్క రన్ ఇవ్వకుండా నాలుగు వికెట్స్ తీశాడు. పాట్ కమిన్స్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, జోష్‌ ఇంగ్లిస్‌లను షమీ వెనక్కి పంపగా.. ఆష్టన్ అగర్ (0)ను రనౌట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహమ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. షమీ బౌలింగ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా ఫిదా అయ్యాడు. చివరి ఓవర్లో షమీ అలా ఆడతాడని అస్సలు ఊహించలేదన్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'మహమ్మద్‌ షమీకి కేవలం ఆరు బంతులు ఆడే అవకాశం మాత్రమే లభించింది. కానీ షమీ తన బౌలింగ్‌తో మనల్ని ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగుల దూరంలో ఉండగా.. భారత్‌ గట్టెక్కే అవకాశాలు కనిపించలేదు. షమీ యార్కర్ల మీద యార్కర్లు వేశాడు. ఒకే ఒక్క షార్ట్‌ బాల్‌ సంధించాడు. భారత్‌ను గెలిపించాడు' అని అన్నాడు. 


వార్మప్‌ మ్యాచులు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి, ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికే ఉపయోగపడుతాయి అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరోన్ ఫించ్ (76) ఒంటరి పోరాటం చేశాడు. మొహ్మద్ షమీ ఒక ఓవర్లో మూవుడు వికెట్స్ పడగొట్టి 4 రన్స్ ఇచ్చాడు. 


Also Read: భారత క్రికెట్‌లో ఆ రెండు పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది: బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ


Also Read: Ginna - Ori Devuda : ఈ వారం బాక్సాఫీస్ వార్.. నిలిచేది ఎవరు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook