Rishabh Pant as Captain: భారత టెస్ట్‌ టీమ్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ గేమ్ ఛేంజర్ అని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ టెస్ట్‌ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పంత్.. ఐదు టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. గతేడాది కారు ప్రమాదంలో తీవ్రగాయపడడంతో ఆటకు దూరమయ్యాడు. ఏడాదిగా జట్టుకు దూరం కావడంతో టీమిండియాలో రీఎంట్రీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయాల నుంచి కోలుకున్న పంత్.. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్, టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలకు రిషబ్ పంత్ దూరమయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నేను చాలా రోజుల నుంచి పంత్‌తో మాట్లాడుతున్నాను.. పంత్ సుదూర భవిష్యత్‌ గురించి మాట్లాడుతున్నాను. పంత్ టెస్ట్ క్రికెటర్‌గా 24 క్యారెట్ల బంగారం. అతను గేమ్ ఛేంజర్. రోహిత్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత నెక్ట్స్‌ కెప్టెన్ అనే ప్రశ్నకు నేను రిషబ్ పంత్‌ను ఎంచుకుంటాను. లేదంటే శుభ్‌మన్ గిల్‌కు ఓటేస్తాను" అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో తెలిపారు.


రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ దాదాపు పూర్తిగా కోలుకున్నాడు. గత నెలలో జాదవ్‌పూర్ యూనివర్శిటీ సాల్ట్ లేక్ క్యాంపస్ పిచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ సెషన్‌లో కూడా చేరాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. గత సీజన్‌లో పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. 


ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022లో ఎంపికైన ఏకైక టీమిండియా ప్లేయర్ పంత్. 2022లో పంత్ అద్భుత ఫామ్‌ను కనబర్చాడు. 12 ఇన్నింగ్స్‌లలో 61.81 సగటుతో, 90.90 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేశాడు. 2022లో టెస్టుల్లో 21 సిక్సర్లు కొట్టిన పంత్ రెండు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు సాధించాడు. కీపింగ్‌లో ఆరు స్టంపింగ్‌లు, 23 క్యాచ్‌లు అందుకున్నాడు.


Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు


Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి