భారత్‌పై ఫించ్ సరికొత్త రికార్డు
భారత్-ఆస్ట్రేలియాల మధ్య శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్ ఒక నూతన రికార్డును నమోదు చేశాడు. ఈ ఆటలో 42 పరుగులు చేసిన ఫించ్ టీ20 మ్యాచ్‌లలో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 47.71 సగటుతో ఫించ్ 334 పరుగులు చేయడం గమనార్హం. టీ20లకు సంబంధించి భారత జట్టుపై ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. గతంలో షేన్ వాట్సన్ 8 ఇన్నింగ్స్‌లలో చేసిన 302 పరుగులు మాత్రమే రికార్డులకు ఎక్కగా, శనివారం వాటిని ఫించ్ బ్రేక్ చేశాడు. మరోవైపు టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గానూ ఫించ్ వార్తల్లోకెక్కాడు. 32 టీ20 మ్యాచ్‌ల్లో 1124 పరుగులు సాధించిన ఫించ్ ఖాతాలో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు కూడా ఉండడం విశేషం.