Ab De Villiers Re-Entry: ఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్.. కోహ్లీ ప్రకటన!
Ab De Villiers Re-Entry: ఏబీ డివిలియర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మిస్టర్ 360 తిరిగి ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నాడట. గతేడాది క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు చెప్పిన తర్వాత ఏబీ డివిలియర్స్.. ప్రస్తుత సీజన్ లో పాల్గొనలేదు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్ ను తిరిగి ఐపీఎల్ లోకి తీసురానున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు.
Ab De Villiers Re-Entry: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడట! ఇదే విషయాన్ని ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించాడు. ఆర్సీబీ జట్టులోకి ఏబీ డివిలియర్స్ తిరిగి చేరేందుకు అవకాశం ఉందని.. కానీ, అతడు బ్యాటర్ గా కాకుండా కోచ్ టీమ్ లో చేరనున్నాడని తెలుస్తోంది.
ఏబీ డివిలియర్స్ మళ్లీ RCB జట్టులో చేరగలడా?
RCB టీమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "నేను ఏబీ డివిలియర్స్ ను చాలా మిస్ అవుతున్నాను. నేను ఏబీ డివిలియర్స్‌తో రెగ్యులర్‌గా మాట్లాడతాను. అతను ఇటీవల తన కుటుంబంతో కలిసి గోల్ఫ్ చూసేందుకు అమెరికా వెళ్లాడు. వచ్చే ఏడాదిలోగా అతడు తిరిగి ఆర్సీబీ టీమ్ లో చేరే అవకాశం ఉంది. RCB జట్టుకు సంబంధించిన కోచ్ ల బృందంలో చేరనున్నాడు" అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ ఆడిన 12 మ్యాచ్ ల్లో కేవలం 216 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. ఈ సీజన్ లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు. అయితే కోహ్లీ కెరీర్ లో ఒకే సీజన్ లో 3 సార్లు డకౌట్ అవ్వకపోవడం విశేషం. ఈ క్రమంలో తన ఆటపై వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని విరాట్ కోహ్లీ అంటున్నాడు.
Also Read: Sachin - Gill: సేమ్ టూ సేమ్.. 2009లో సచిన్, 2022లో గిల్! ఐపీఎల్‌లో ఈ ఇద్దరు మాత్రమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.