AB Devilliers: క్రికెట్ నుంచి తప్పుకుని అభిమానులకు నిరాశ మిగిల్చిన విధ్వంసకర ఆటగాడు ఫ్యాన్స్‌కు ఊరట కల్గించే విషయాన్ని ప్రకటించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మట్ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఏబీ డివిలియర్స్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశమిది. త్వరలో అదే టీమ్‌కు కోచ్‌గా ఏబీ డివిలియర్స్ రానున్నాడని తెలుస్తోంది. 


క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఇతర పాత్రలు పోషించేందుకు సిద్ధమౌతున్నారు. ఐపీఎల్ సీజన్ 15లో(IPL Season 15) ఆర్‌సీబీ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఏబీ డివిలియర్స్‌ను నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్సీబీ జట్టు యాజమాన్యం ఏబీ డివిలియర్స్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సంకేతాల్ని స్వయంగా ఆ జట్టు హెడ్ కోచ్ ప్రస్తుతం ఇండియా - న్యూజిలాండ్ కామెంటేటర్ సంజయ్ బంగర్ ఇవ్వడం విశేషం.


ఏబీ డివిలియర్స్(AB Devilliers) వంటి ప్రధానమైన, కీలకమైన ఆటగాళ్లకు బ్యాటింగ్ కోచ్ పదవి ఇస్తే జట్టుకు చాలా ఉపయోగముంటుందని సంజయ్ బంగర్ చెప్పాడు. బ్యాటింగ్ కోచ్‌గా ఆటగాళ్లలో లోపాలుంటే సవరించే అవకాశముంటుంది. ప్రతి జట్టుకు బ్యాటింగ్ కోచ్ చాలా అవసరమని తెలిపాడు. ఆర్సీబీ జట్టు(RCB) ఏబీ డివిలియర్స్‌ను జట్టు కోచ్‌గా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించాడు.


Also read: Team India Play Eleven: ముంబై రెండవ టెస్ట్‌లో టీమ్ ఇండియా ప్లే లెవెన్ ఎవరో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook