ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నడ్డి విరిచి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు విజయాన్ని కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించినవారెవరో అందరికీ తెలుసు. ఆ కుర్రాడే ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్. బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు ఈ కుర్రాడు. 10 బాల్స్‌లో 34 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" పురస్కారం కూడా దక్కించుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మ్యాచ్ గెలిచి జట్టు సంబరాలు జరుపుకుంటున్నప్పుడు సహ క్రికెటర్లు షాంపైన్ తీసుకొచ్చి ఇస్తే మాత్రం.. రషీద్ ఖాన్ వద్దన్నాడట. ఎందుకంటే తాను మద్యం సేవించనని.. ఇస్లాం మతానికి అది విరుద్ధమని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే రషీద్ షాంపైన్‌ను నిరాకరిస్తున్నట్లు చూపించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది.


రషీద్ చేసింది చాలా మంచిపని అని.. అతను తన మత సంప్రదాయాలను కచ్చితంగా అమలుచేసి నలుగురికీ ఆదర్శంగా నిలిచాడని పలువురు ఆయనను కితాబులతో ముంచెత్తారు. ఐపీఎల్ వేలంలో రూ.4 కోట్ల రూపాయలకు జట్టు రషీద్‌‌ను కొనుగోలు చేసినా.. ఆ కుర్రాడు మాత్రం జట్టు విజయాల్లో మాత్రం ప్రధాన పాత్ర పోషించి పైసా వసూల్ క్రికెటర్‌గా పేరందుకున్నాడు.