After some days Team India will say we don’t have Babar Azam and Mohammad Rizwan says Rashid Latif: టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్‌ లతీఫ్‌ (Rashid Latif:) సెటైర్లు వేశాడు. ఇటీవలి కాలంలో పాక్ టీ20ల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వరుస సిరీసులను గెలుచుకుంటుది. ముఖ్యంగా ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌ అత్యద్భుత ప్రదర్శన చేస్తూ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిసున్నారు. అత్యధిక ఓపెనింగ్‌ శతక భాగస్వామ్యాల రికార్డు నెలకొల్పారు. వీరితో పాటు ఫకర్ జమాన్, షాహిన్ షా ఆఫ్రిదిలు మంచి ఫామ్ కనబరుస్తున్నారు. వెస్టిండీస్‌పై 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును గెలుచుకున్న రిజ్వాన్.. ఈ సంవత్సరం టీ20లలో అత్యధిక (2000) పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్ ప్లేయర్స్ మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో ఓ పాక్ టీవీ ఛానెల్లో వాళ్లని పొగిడిన రషీద్‌ లతీఫ్‌ (Rashid Latif:).. భారత ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడాడు. 'ఏడాది క్రితం పాకిస్థాన్‌ జట్టులో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు లేరని అనుకునేవాళ్లం. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో లేరని చాలాసార్లు చర్చించుకున్నాం. అయితే ఏడాదిలోగా పరిస్థితులు పూర్తిగా మారాయి. మరికొన్ని రోజుల్లో భారతీయులు కూడా మా జట్టులో మొహ్మద్ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్ వంటి ఆటగాళ్లు లేరని అనుకుంటారు' అని సెటైర్ వేశాడు. 


Also Read: Instagram Love & Kidnap: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ నాటకం, ఆ పై కిడ్నాప్


మొహ్మద్ రిజ్వాన్‌, బాబర్‌ ఆజామ్ ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్‌ జోడిగా నిలిచారు. అంతేకాదు ఏడు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి.. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌ నెలకొల్పిన 6 శతకాల రికార్డును బద్దలుకొట్టారు. ఈ క్రమంలోనే ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో రిజ్వాన్‌ 2 వేలకు పైగా పరుగులు చేయగా.. బాబర్‌ 1779 పరుగులు చేశాడు. దీంతో వీరిద్దరూ ప్రపంచంలోనే మేటి ఓపెనర్లుగా రాణిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2021లో కూడా ఈ ఇద్దరు చెలరేగిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో పాక్ సెమీస్ చేరగా.. భారత్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. 


Also Read: Pushpa Day 2 Collections: వంద కోట్ల క్లబ్​లో 'పుష్ప ది రైజ్'​- రెండు రోజుల్లోనే ఘనత!


టీ20 ప్రపంచకప్ 2021లో బాబర్ ఆజామ్ (Babar Azam) చెలరేగాడు. ఆరు మ్యాచ్‌లలో 60.60 సగటు మరియు 126.25 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. అరంగేట్రం టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఓ రికార్డు సృష్టించాడు. అజామ్ ప్రస్తుతం నంబర్ వన్ వన్డే బ్యాటర్. అంతేకాదు ఈ ఏడాది టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఈ ఏడాది మొహ్మద్ రిజ్వాన్‌ (Mohammad Rizwan) కూడా తన పరుగుల దాహం తీర్చుకున్నాడు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook