South Africa New Captain Aiden Markram: దక్షిణాఫ్రికా టీ20 టీమ్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. తెంబా బావుమా స్థానంలో ఐడెన్ మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బావుమా గత నెలలో తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. 2014లో జరిగిన ఐసీసీ U19 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించిన మార్‌క్రమ్.. ఇప్పుడు సీనియర్ జట్టుకు బాధ్యతలు చేపట్టనున్నాడు. సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మార్‌క్రమ్.. జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఇటీవలె ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023కి తమ జట్టు బాధ్యతలను మార్‌క్రమ్‌కు అప్పగించింది. తాజాగా సఫారీ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అదేవిధంగా జేపీ డుమినీ వైట్ బాల్‌ ఫార్మాట్‌కు కోచ్‌గా ఎంపికయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్‌క్రమ్ కెరీర్‌ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటివరకు 34 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 47 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పవర్ హిట్టింగ్ చేయడంతోపాటు స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. మార్‌క్రమ్ కాసేపు క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు బెంబెలేత్తిపోవాల్సిందే. ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టుకు ఐడెన్ మార్క్రామ్‌ను కెప్టెన్‌గా చేసింది. ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ 31 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 79 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 147.73 కాగా.. సగటు 38.22గా ఉంది. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


 




ఈ సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన కొత్త కెప్టెన్‌గా మార్‌క్రమ్‌ను నియమించింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేలవమైన ఫామ్‌లో ఉండడంతో జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2022 వేలంలో మార్‌క్రమ్‌ను రూ.2.6 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది ఎస్‌ఆర్‌హెచ్. గతేడాది సీజన్‌లో ఐడెన్ 12 ఇన్నింగ్స్‌లలో 139.05 స్ట్రైక్ రేట్‌, 47.62 సగటుతో 381 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మొత్తం 20 మ్యాచ్‌లు ఆడిన మార్‌క్రమ్‌.. మూడు అర్ధ సెంచరీల సహాయంతో 527 రన్స్‌ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరు 6 మ్యాచ్‌ల్లో 146 పరుగులు చేశాడు.  


Also Read: Holi 2023: హోలీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ప్రకటన   


Also Read: Twitter: ట్విట్టర్‌లో కీలక మార్పు.. ట్వీట్ లిమిట్ పెంచుతూ ఎలాన్ మస్క్ ప్రకటన  
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి