IND vs ENG Weather Updates: టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. అడిలైడ్‌ ఓవల్‌ వేదిక రెండు జట్లు బిగ్‌ ఫైట్‌కు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి భయం పట్టుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అడిలైడ్‌లో భారీ వర్షం కురిసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. రిజర్వ్ డే ఉంటుంది. అప్పుడు సాధ్యం కాకపోతే టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడి.. 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అటు ఇంగ్లాండ్ గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ ఆడిన 5 మ్యాచ్‌లలో మూడింట్లో గెలవగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌తో ఇంగ్లండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.


ఇక రెండు జట్లు నేడు సెమీస్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అడిలైడ్‌లో వాతావరణం మారిపోయింది. రాత్రిపూట వర్షం కురిసింది. ఉదయం కూడా వర్షం కురవడంతో మ్యాచ్ సమయానికి ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించి వర్షం ఆగిపోయినా.. మబ్బులు కమ్ముకుంటున్నాయి. అయితే సాయంత్రం సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 


ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం మ్యాచ్‌ జరగకపోతే.. రిజర్వ్ డే అంటే శుక్రవారం నిర్వహిస్తారు. అప్పటికీ మ్యాచ్ పూర్తి కాకపోతే.. సెమీస్ మ్యాచ్ రద్దవుతుంది. ఇలా అయితే భారత్‌కు మేలు జరుగుతుంది. గ్రూప్ దశలో టాప్ ప్లేస్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్ 4 మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లు సాధించింది. మరోవైపు ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల్లో విజయం, ఒక మ్యాచ్ రద్దుతో 7 పాయింట్లతో ఉంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ క్యాన్సిల్ అయితే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైనల్లో టీమిండియా ఢీకొంటుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తున్నారు.


Also Read: T20 World Cup: భారత్ vs ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ నేడే.. పాక్​తో ఫైనల్ ఆడేదెవరో?


Also Read:  IND vs ENG Matches: ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచుల్లో ఎవరు ఎక్కువ గెలిచారో తెలుసా ?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook