Amazon Prime Video to Broadcasting India vs New Zealand T20 and ODI Series matches with new features: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు నిరాశపరిచిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన భారత్.. సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి ఒట్టిచేతులతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. పొట్టి టోర్నీ అనంతరం టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగే తొలి టీ20‌లో ఆతిథ్య కివీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ vs న్యూజిలాండ్ సిరీస్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు అమెజాన్ ప్రైమ్ వీడియో తీపికబురు అందించిన విషయం తెలిసిందే. కొత్త ఫీచర్లతో భారత్, న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించడానికి 'ఇన్-గేమ్ లాంగ్వేజ్ సెలెక్టర్' మరియు 'రాపిడ్ రీక్యాప్' వంటి కొన్ని కొత్త ఫీచర్‌లను తీసుకొచ్చింది. ఇన్-గేమ్ లాంగ్వేజ్ సెలెక్టర్ ద్వారా కస్టమర్‌లు ప్లేయర్ నుంచి నిష్క్రమించకుండానే భాషను మార్చుకోవచ్చు. అంటే.. లైవ్ మ్యాచ్ రన్ అవుతుండగానే తెలుగు నుంచి ఇంగ్లీషు లేదా హిందీకి మారొచ్చు. 


ఇక రాపిడ్ రీక్యాప్ ఆప్షన్ ద్వారా కస్టమర్‌లు ఆటోమేటిక్‌గా లైవ్ స్ట్రీమ్‌ సహా గేమ్ హైలైట్‌లను తెలుసుకోవచ్చు. ప్రైమ్ వీడియో కామెంటరీ టీమ్‌లో రవిశాస్త్రి, హర్షా భోగ్లే, జహీర్ ఖాన్, అంజుమ్ చోప్రా, గుండప్ప విశ్వనాథ్, వెంకట్పతి రాజు వంటి సీనియర్లు ఉంటారు. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంలో గేమ్ విశ్లేషణ కోసం ప్రీ, మిడ్ మరియు పోస్ట్ షోలు ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియో వ్యాఖ్యానం అందించనుంది. 



న్యూజిలాండ్ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ దూరంగా ఉన్నారు. టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేల్లో శిఖర్ ధావన్ భారత జట్టును నడిపించనున్నారు. హార్దిక్, ధావన్ గతంలో కూడా జట్టును నడిపించారు. దాంతో వారిపై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 


Also Read: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రా.. చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది! ఈజీగా పట్టేసిన వ్యక్తి  


Also Read: ఉప్పెనలా ఎగిసిపడుతున్న జాన్వీ కపూర్ ఎద అందాలు.. జూనియర్ శ్రీదేవిని ఇలా ఎప్పుడూ చూసుండరు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి