Ambati Rayudu Daughter Gets Death Threats: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆరెంజ్‌ క్యాప్‌లతో టైటిల్స్ గెలవాలేమంటూ విరాట్ కోహ్లీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ప్లే ఆఫ్స్ చేరితేనే టైటిల్ విన్ అయినట్లు ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారంటూ సెటైర్లు వేశాడు. ఆర్‌సీబీని టార్గెట్ చేస్తూ అంబటి రాయుడు కామెంట్స్ చేయడంతో.. అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అంబటి రాయుడిని బండబూతులు తిడుతూ ట్రోల్స్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి


కొందరైతే అంబటి రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని.. రాయుడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారని ఆయన స్నేహితుడు సామ్ పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతోందని రాసుకొచ్చారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే తనకు బెదిరింపులు రావడంపై అంబటి రాయుడు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.


"ఈ రోజు నేను, నా అత్తవారి కుటుంబం, నా స్నేహితుడు అంబటి రాయుడు, ఆయన భార్య, ఇద్దరు పిల్లల కుటుంబంతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్లాను. రాయుడు స్టార్ స్పోర్ట్స్‌తో కామెంటేటర్‌గా మారాడు. ఇటీవల ఓ జట్టును విమర్శిస్తూ రాయుడు కామెంట్స్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీకి మద్దతు ఇస్తున్న కొందరు పోకిరీలు, క్రిమినల్స్, పీఆర్ ఏజెన్సీలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. నా భార్య అశ్విని, అంబటి రాయుడి ఫోటోలు పోస్ట్ చేసిన వారితో సహా అన్ని పేజీలలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు.


నేను, అంబటి రాయుడు మొదట్లో వాటి గురించి నవ్వుకున్నాము. కానీ ఏడాది, నాలుగేళ్ల వయసున్న కూతుళ్లను అత్యాచారం చేస్తామని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని రాయుడు భార్య విద్య నాతో చెప్పింది. అతని భార్యను కూడా బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. చిన్నారులను చంపుతామనడం, అత్యాచారం చేస్తామనడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన నేరం. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది..? పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.." అంటూ అంబటి రాయుడు స్నేహితుడు సామ్ పాల్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.  


Also Read: Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter