ఢిల్లీ క్యాపిటల్స్ కు (DC) చెందిన సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా (Amit Mishra) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL 2020 ) సాధించిన ఘనతను చూస్తే టీమ్ ఇండియాలో అతనికి మంచి స్థానం లభించాలి. కానీ దాని గురించి ఇప్పడు ఆలోచించడం లేదట అమిత్ మిశ్రా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు


ఐపీఎల్ లో 148 మ్యాచుల్లో 157 వికెట్లు తీశాడు.  ఈ లీగ్ లో అందరికన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లసిత్ మలింగా తరువాత అమిత్ మిశ్రా ఉంటాడు. 


తన మనసులో మాట బయటపెట్టిన అమిత్ మిశ్రా.. "నేను ఇతరులకన్నా మెరుగ్గా ఉన్నానో లేదో నాకు తెలియదు. గతంలో దీని గురించి చాలా ఆలోచించేవాడిని. దాంతో అనేక ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు కేవలం ఆటపై ఫోకస్ పెడుతున్నాను"  అని అన్నాడు.


సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గురించి మాట్లాడిని మిశ్రా.." నిజం చెప్పాలంటే నా అర్హతకు తగినది నాకు లభించలేదు. ప్రజలకు అమిత్ మిశ్రా ఏంటో తెలుసు. ఇది చాలు నాకు. నాకు కేవలం నా క్రికెట్, నా బౌలింగ్ పై మాత్రమే ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు.



ALSO READ| Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


37 సంవత్సరాల ఈ బౌలర్ హర్యాకు చెందిన తన తోటి బౌలర్ రాహుల్ తేవాటియా ను పొగుడుతూ..ఐపీఎల్ లో ఎలాంటి ఆటను ప్రజలు ఆశిస్తారో అలాంటి ఆటే తేవాటియా ఆడి చూపించాడని అన్నాడు.


తేవాటియా గత కొంత కాలం నుంచి తన బ్యాటింగ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు అని..భవిష్యత్తులో మరిన్ని అధ్భుతాలు చేస్తాడని తెలిపాడు అమిత్ మిశ్రా.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR