టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త రికార్డును నెలకొల్పాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు (95)తీసిన తొలి పేసర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 26సార్లు 5 వికెట్లు తీసిన ఆండర్సన్.. లార్డ్స్‌లో ఆరోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. అటు 2018లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా అశ్విన్ (142)నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో విఫలమై 107 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో.. భార‌త్ బ్యాటింగ్ చేసింది. అయితే, వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో పిచ్ బౌలింగ్‌కు అనుకూలించ‌డంతో భార‌త్ బ్యాట్స్‌మెన్స్ ఫెవిలియ‌న్‌ బాట పట్టారు. మ‌ధ్య మ‌ధ్యలో వర్షం ఆటంకం క‌లిగించినా.. 35 ఓవ‌ర్ల మ్యాచ్ కొన‌సాగించి,. 107 ప‌రుగుల వ‌ద్ద ఆలౌట్ అయింది భారత్.


ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ కాగా, పుజారా 1 , కెఎల్ రాహుల్ 8, రహానే 18 పరుగులకే అవుట్ అవ్వగా.. అశ్విన్ (29)ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 5 వికెట్లు, వోక్స్ 2, బ్రాడ్, కుర్రన్ చెరో ఒక్కో వికెట్ తీయగా.. లార్డ్స్‌లో 99 వికెట్లను తీసిన బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. శనివారం నాడు ఇంగ్లాండ్ త‌న ఇన్నింగ్స్‌ ఆటను కొనసాగించ‌నుంది.