Andre Russell Run Out in BPL 2022: క్రికెట్ ఆటలో నిత్యం ఎదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. బ్యాటర్ తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేయడం.. ఫీల్డర్ బౌండరీ వద్ద అద్భుత క్యాచ్‌లు పట్టడం.. ఓ ప్లేయర్ స్టన్నింగ్ రనౌట్‌లు చేయడం మనం ఇదివరకు చూసే ఉంటాం. తాజాగా ఎవరూ ఊహించని విధంగా, క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రనౌట్ చోటుచేసుకుంది. వెస్టిండీస్ హిట్టర్ ఆండ్రీ రసెల్ (Andre Russell) రనౌటవ్వడం క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (BPL 2022)లో ఇది జరిగింది. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా శుక్రవారం మినిస్టర్ గ్రూప్ ఢాకా, కుల్నా టైగర్స్‌ (KT vs MGD) మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢాకాకు ఓపెనర్లు మహ్మద్ షాజాద్ (42), తమీమ్ ఇక్బాల్ (50) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరితో పాటు నైమ్ (7) ఔట్ అవ్వడంతో ఢాకా కష్టాలో పడింది. ఈ సమయంలో జట్టు భారం మహ్మదుల్లా (39)పై పడింది. మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్‌తో ఢాకా ఇన్నింగ్స్‌ సజావుగా సాగుతోంది. అతడికి తోడు ఆండ్రీ రసెల్‌ క్రీజులో ఉన్నాడు. 


Also Read: Horoscope Today January 22 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలే!!


ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఐదో బంతిని విండీస్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌ భారీ సిక్స్‌ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ఉంచుకోవాలని భావించిన రసెల్‌.. థర్డ్‌మన్‌ దిశగా ఓ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మెహదీ హసన్‌ (Mehidy Hasan).. బంతిని అందుకొని స్ట్రైకింగ్‌ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకగా.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి వచ్చేశాడు. నాన్ స్ట్రైక్ వైపు వెళుతున్న రసెల్‌ తన వైపు బంతి విసరలేదు కదా అనే ధీమాతో నెమ్మదిగా పరుగెత్తాడు. అదే అతడి కొంపముంచింది. 



ఫీల్డర్ మెహదీ హసన్‌ వేసిన త్రో స్ట్రైకింగ్‌ ఎండ్‌ వద్ద ఉన్న వికెట్లను తాకి.. అక్కడి నుంచి వేగంగా నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపు వెళ్లింది. ఆండ్రీ రసెల్‌ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. ఇది చూసిన కుల్నా టైగర్స్‌ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోగా.. రసెల్‌ మాత్రం షాక్ అయ్యాడు. రనౌట్ కోసం ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌ సాయం కోరాడు. బిగ్‌ స్క్రీన్‌పై రసెల్‌ క్లియర్‌ రనౌట్‌ (Andre Russell Run Out) అని తేలింది. ఇంకేముందు రసెల్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు. తాను ఇలా ఔటవుతానని రసెల్‌ అసలు ఊహించి ఉండడు. ప్రస్తుతం రసెల్‌ ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


Also Read: Priyanka Chopra - Nick Jonas: షాకింగ్ న్యూస్.. తల్లైన స్టార్ హీరోయిన్! అంతా సీక్రెట్‌గానే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook