Netizens trolls Andrew Symonds, Shane Warne over mocking Marnus Labuschagne: రెండు నెలల వ్యవధిలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను కోల్పోయింది. ఈ ఏడాది మార్చి 4న స్పిన్ లెజెండ్ షేన్‌ వార్న్‌ గుండెపోటుతో మరణించగా.. శనివారం (మే 14) మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఇద్దరి మృతితో క్రికెట్ ఆస్ట్రేలియా ద్రిగ్భ్రాంతికి గురైంది. అయితే వార్న్‌, సైమండ్స్ వ్యవహార శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఈ ఇద్దరు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. మందు, అమ్మాయిల విషయంలో చాలాసార్లు వార్న్‌ వివాదాల్లో చిక్కుకోగా.. మంకీ గేట్ లాంటి వివాదంలో సైమండ్స్ ఇరుక్కున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆండ్రూ సైమండ్స్‌ మరణ వార్తతో.. షేన్‌ వార్న్‌, సైమండ్స్‌కు సంబంధించిన ఓ పాత వివాదం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. 2021లో సిడ్నీలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచుకు కామెంటేటర్లుగా ఉన్న ఈ ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‌పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇందుకు సబంధించిన వీడియోను ఓ ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్‌ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా అయింది. 


సిడ్నీ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబూషేన్‌ 91 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. ముందుగా ఆండ్రూ సైమండ్స్‌ మాట్లాడుతూ.. లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. ఏదైనా మందులు (హాగ్‌ పైల్‌) ఇవ్వండి అంటూ బూతులు తిట్టాడు. నిజమే అంటూ షేన్‌ వార్న్‌ అందుకున్నాడు. 'ఫక్.. అతడు బ్యాట్‌ని సరిగ్గా..' అంటూ బూతులు తిట్టాడు. మనం అతనికి హాగ్ పైల్ ఇవ్వవలసి ఉంటుంది అని సైమండ్స్ అన్నాడు. ఇది పెద్ద దుమారం అయింది. దాంతో సదరు ఛానెల్ క్షమాపణలు చెప్పింది. అయితే వార్న్ మరియు సైమండ్స్ మౌనంగా ఉన్నారు.


ఈ బూతు మాటలతో షేన్‌ వార్న్‌, ఆండ్రూ సైమండ్స్‌ విమర్శలపాలయ్యారు. అయితే ఈ రెండు నెలల వ్యవధిలో వార్న్‌, సైమండ్స్‌లు చనిపోవడంతో.. మార్నస్ లబూషేన్‌ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 'లబూషేన్‌ను అనరాని మాటలు అన్నారు.. అనుభవించారు', 'బూతులు తిట్టారు.. ప్రాణాలు కోల్పోయారు' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లబూషేన్‌ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. 


Also Read: Shashank Singh Catch: బౌండరీ లైన్‌ వద్ద శశాంక్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన అజింక్య రహానే! సచిన్ పొగడ్తలు


Also Read: Andrew Symonds Death: ఆండ్రూ సైమండ్స్ మృతి.. హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే! భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.