Who is Anil Dalpat: పాకిస్థాన్ తరఫున అందరూ ముస్లింలే క్రికెట్ ఆడుతుండడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ ఆ దేశంలో ముస్లిం జనాభా ఉంటుంది కాబట్టి వాళ్లే జాతీయ జట్టుకు ఆడుతుంటారు. హిందువులు చాలా తక్కువ మంది పాక్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. పాకిస్థాన్ జట్టు తరఫున క్రికెట్ ఆడిన మొదటి హిందువు ఎవరంటే చాలా మందికి ఆ ఆటగాడి పేరు గుర్తుండదు. ఆయనే అనిల్ దల్పత్. నేడు 60వ పుట్టినరోజు. దల్పత్ సింధ్‌లో జన్మించాడు. ఆయన తన కుటుంబంతో కొన్నేళ్ల క్రితం సూరత్ నుంచి వచ్చి కరాచీకి స్థిరపడ్డాడు. అనిల్ తండ్రి దల్పల్ సోన్వారియా క్రికెట్ క్లబ్ స్థాయి పోటీల్లో ఆడేవారు. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ అభిమానంతోనే నవంబర్ 1959లో ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లాహోర్‌లో ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ 134 పరుగులు చేశాడు. ఆయన పేరు నార్మన్ ఓనీల్ పేరు. ఆ క్రికెటర్ పేరు మీదనే తన కుమారుడు దల్పత్ అనిల్ అని పెట్టకున్నారు. అనిల్ 1976-77 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే కెరీర్ ప్రారంభ రోజులలో ప్రభావం చూపలేకపోయాడు.


1984లో వసీం బారి పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అనిల్ దల్పత్‌కు జాతీయా జట్టు నుంచి పిలుపువచ్చింది. సీనియర్ జట్టుకు ఆ సమయంలో ఫస్ట్-ఛాయిస్ వికెట్ కీపర్‌గా అనిల్‌ను తీసుకున్నారు. జహీర్ అబ్బాస్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించగా.. అనిల్ ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.


అక్టోబరు 1952లో తమ తొలి టెస్టు ఆడిన పాకిస్థాన్.. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో భాగమైంది. కానీ అప్పటి నుంచి 69 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ముస్లిమేతర క్రికెటర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అనిల్ దల్పత్ తర్వాత పాకిస్థాన్‌కు ప్రాతినిధ్య వహించింది డానిష్ కనేరియా మాత్రమే. కనేరియా 61 టెస్టుల్లో ఆడి 261 వికెట్లు పడగొట్టాడు. పాక్ స్పిన్నర్లలో అత్యధిక వికెట్ల రికార్డు ఇప్పటికీ కనేరియా పేరు మీదనే ఉంది. అనిల్ దల్పత్‌కు డానేష్ కనేరియా బంధువు కావడం విశేషం.


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook