India vs Pakistan Asia Cup 2022, Netizens slams Arshdeep Singh after he drops Asif Ali catch: ఆసియా కప్‌ 2022లో భారత్ తొలి ఓటమిని ఎదుర్కొంది. లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి దర్జాగా సూపర్ 4 చేరిన టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మాత్రం పరాజయం పాలైంది. సూపర్ 4లో భాగంగా ఆదివారం ఉత్కంతంగా సాగిన మ్యాచ్‌లో పాక్‌ చేతిలో5 వికెట్ల తేడాతో భారత్‌ ఓడిపోయింది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన రోహిత్ సేన.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెత్త ప్రదర్శన చేసి మూల్యం చెల్లించుకుంది. భారత్ ఓటమికి ఎన్నో కాణాలు ఉన్నా.. ఓ కీలక క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛేజింగ్‌లో పాకిస్తాన్ 17వ ఓవర్ ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. పాక్ విజయానికి ఇంకా మూడు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటివరకు మెరుపులు మెరిపించిన మహ్మద్‌ రిజ్వాన్‌ (71; 51 బంతుల్లో 6×4, 2×6), మహ్మద్‌ నవాజ్‌ (42; 20 బంతుల్లో 6×4, 2×6) పెవిలియన్ చేరడంతో టీమిండియాలో గెలుపు ఆశలు చిగురించాయి. ఖుష్దిల్ షా, అసిఫ్‌ అలీలు క్రీజులో ఉన్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ 18వ ఓవర్ వేయగా.. మొదటి రెండు బంతులకు మూడు రన్స్ (రెండు వైడ్స్) వచ్చాయి. మూడో బంతిని అసిఫ్‌ షాట్ ఆడగా.. షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్ సింగ్ సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. నేరుగా వచ్చి చేతిలో పడినా.. అర్ష్‌దీప్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 



అర్ష్‌దీప్ సింగ్ సునాయాస క్యాచ్‌ను వదిలేసిన సమయంలో అసిఫ్‌ అలీ ఒక్క పరుగు కూడా చేయలేదు. ఈ జీవనాదారం అనంతరం అసిఫ్‌ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాది పాక్ విజయానికి బాటలు వేశాడు. అసిఫ్‌ 8 బంతుల్లో 16 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఒకవేళ అర్ష్‌దీప్ ఆ  క్యాచ్‌ను పట్టి ఉంటే.. ఛేజింగ్‌లో పాకిస్తాన్ వెనకబడేదే. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. కీలక క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. 'నేటి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ విలన్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'డ్రెస్సింగ్ రూంలో అర్ష్‌దీప్‌కు ఉంది పో' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అర్షదీప్ సింగ్ కనబడితే కాల్చేస్తా అన్నటుగా.. ఓ ముగ్గురు బైక్‌పై బయలుదేరిన మీమ్ నవ్వులు పూయిస్తోంది. 





Also Read: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారు ప్రేమ విషయంలో జాగ్రత్త!


Also Read: IND vs PAK: నిరాశపరిచిన భారత బౌలర్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook