అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు టీమిండియా వెటరన్ ఫేస్ బౌలర్ ఆశీస్ నెహ్రా  (38) ప్రకటించాడు.  నవంబర్ నెలలో భారత్-కివీస్ జట్ల మధ్య జరిగే తన మ్యాచ్ చివరి క్యాచ్ అని వెల్లడించాడు. నవంబర్ 1న ఢిల్లీలోని ఫిరోషా కోట్లా మైదానంలో న్యూజిలాండ్ తో మ్యాచ్ జరుగనుంది. సొంత స్టేడియం కావడంతో ఇక్కడే వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసీస్ తో ప్రస్తుతం జరుగుతున్న టి 20 సిరీస్ కు  బీసీసీఐ కమిటీ  ఆశీస్ నెహ్రాను ఎంపిక చేసిన  విషయం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచుల్లో విశేషంగా రాణిస్తున్న ఆశీస్ నెహ్రా తొమ్మిది నెలల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కింది. 15 మంది జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ..ఇప్పటి వరకు అతనికి ఆడే అవకాశం దక్కలేదు..దీనికి తొడు వయసు మీద పడటం, ఫిటెనెస్ వంటి కారణాలున్నాయి. ఈ నేపథ్యంలో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్లు వార్త హల్ చల్ చేస్తోంది.


నెహ్రా ప్రస్థానం...


సరిగ్గా 18 ఏళ్ల క్రితం అంటే.. 1999లో అంతర్జాతీయ క్రికెట్ లో నెహ్రా ఆరంగ్రేటం చేశాడు. భారత్ తరపున 17 టెస్టులు..120 వన్డేలు..26 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. నెహ్రా చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటి వరకు 26 టీ20లు ఆడిన నెహ్రా 34 వికెట్లు తీసి వేశేషంగా రాణించాడు. 18 ఏళ్ల పాటు సుదీర్ఘ క్రికెట్ ఆడిన నెహ్రా... అజారుద్దీన్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఏకైక క్రికెటర్ గా  రికార్డు సృష్టించాడు.