ఆసియా కప్ 2018: భారత్‌కి ఆప్ఘాన్ విధించిన విజయ లక్ష్యం
ఆసియా కప్ 2018 ఆఫ్ఘనిస్తాన్ vs భారత్ మ్యాచ్
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా నేడు భారత్‌తో జరిగిన 11వ వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ మహ్మద్ షాజాద్ 116 బంతుల్లో 124 పరుగులు (4 x 11, 6 x 7) చేసి జట్టు భారీ స్కోర్ చేయడానికి పునాది వేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జావెద్ అహ్మది 5, రహమత్ షా 3, గుల్బదీన్ నాయబ్ 15 తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ.. మహ్మద్ నబీ 56 బంతుల్లో 64 పరుగులు (4 x 3, 6 x 4) కాస్త నిలదొక్కుకుని జట్టు స్కోర్ బోర్డుని మరోసారి పరుగులెత్తించాడు. నజీబుల్లా జద్రాన్ 20, రషీద్ ఖాన్ 12 పరుగులకే వెనుదిరిగారు. నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కి వచ్చిన హస్మతుల్లా షాహిదీ, అస్గర్ ఆఫ్ఘన్ డకౌట్ అయ్యారు.
ఇక భారత బౌలర్లలో జడేజా 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. దీపక్ చహర్, కేదార్ జాదవ్, కేకే అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆసియా కప్ 2018