ఆసియా కప్ 2018: 26 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై భారత్ గెలుపు
ఆసియా కప్ 2018లో భారత్ శుభారంభం చేసింది. టీమిండియా హాంకాంగ్‌పై విజయం సాధించింది. మంగళవారం గ్రూప్-ఎలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా టాస్ ఓడిపోయి భారత్ బ్యాటింగ్‌కి దిగగా.. శిఖర్ ధవన్ (120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127) సెంచరీతో, అంబటి రాయుడు (60 పరుగులు) అర్థ సెంచరీతో జట్టును ముందుండి నడిపించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ 33, రోహిత్ శర్మ 23, కేదార్ జాదవ్ నాటౌట్ 28, భువనేశ్వర్ 9 పరుగులు చేశారు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో కించిత్ షా 3 వికెట్లు, ఎహ్‌సాన్ ఖాన్ 2, నవాజ్, అయిజాజ్ ఖాన్‌లు ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో హాంకాంగ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ నిజాకత్ ఖాన్ (92), అన్షుమన్ రథ్ (73) హాఫ్ సెంచరీలు చేశారు. బాబర్ 18, కార్టర్ 3, కించిత్ షా 17, ఎహ్‌సాన్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, చాహల్ చెరో మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు.
దీంతో భారత జట్టు 26 పరుగుల తేడాతో హాంకాంగ్ పై విజయం సాధించి.. ఆసియా కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక రెండు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది హాంకాంగ్.