ఆసియా కప్ 2018 ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: సోషల్ మీడియాలో సానియా మీర్జా సందేశం
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: సానియా మీర్జా మెస్సేజ్ ట్వీట్
ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా నేడు ఇండియా vs పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. యావత్ ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇదొక అద్భుతమైన మ్యాచ్. భారత్, పాక్ మైదానంలో తలపడుతున్నాయంటే, అది ఏ ఆట అయినా, ఆ ఆటపై ఉండే అంచనాలే వేరు. క్రికెట్ విషయంలో ఆ అంచనాలు ఇంకా రెట్టింపవుతాయి. కేవలం భారత్, పాక్ క్రికెట్ అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రియులను ఉత్కంఠకు గురిచేసే ఈ మ్యాచ్‌లో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చిన ఆటగాళ్లను అభిమానులు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అదే ఆట ఏ మాత్రం అటు ఇటైనా... అదే ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తారు. ఆ ఆటగాళ్ల ఇళ్లపై రాళ్లు రువ్విన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక సోషల్ మీడియాలోనైతే ఈ వీరాభిమానం వెర్రితలలు వేయడం తరచుగా చూస్తున్నదే. అందుకే ఇవాళ ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా సోషల్ మీడియా యూజర్స్‌కి ఓ సందేశం ఇచ్చింది.
[[{"fid":"174166","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ మ్యాచ్‌ని కేవలం క్రికెట్ మ్యాచ్‌గానే పరిగణించి క్రీడా స్పూర్తి ప్రదర్శించాలే తప్ప అంతకుమించి రియాక్ట్ అవకూడదనే సందేశాన్ని ఇస్తూ సానియా మీర్జా ఓ ట్వీట్ చేసింది. అయినా సరే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు రియాక్ట్ అవుతారు కనుక గర్భవతి అయిన తాను కొద్దిరోజులపాటు ఈ సోషల్ మీడియా నుంచి తప్పుకోవడమే మంచిది అని సానియా మీర్జా తన ట్వీట్‌లో పేర్కొంది. అన్నట్టు సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ప్రస్తుతం ఇండియాతో తలపడనున్న పాక్ జట్టులో సభ్యుడనే సంగతి తెలిసిందే.