Ind vs Pak: ఆసియా కప్ 2022లో దాయాది దేశాల మధ్య మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే ఇలానే ఉండాలి. చివరి క్షణం వరకూ ఉత్కంఠత. చివరి ఓవర్‌లో విజయానికి 7 పరుగులు. చేతిలో 6 వికెట్లు. ఏం జరగనుంది. అంతా టెన్షన్..టెన్షన్. చివరి ఓవర్ మొదటి బంతికి..జడేజా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 5 బంతులు 7 పరుగులు..5 వికెట్లు. దినేష్ కార్తీక్ బరిలో దిగాడు. ఒక పరుగు దక్కింది. ఇంకా 4 బంతుల్లో 6 పరుగులు కావాలి. 3 బంతుల్లో 5 పరుగులకు చేరింది. అంతే..హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్‌తో విజయాన్ని అందించాడు.


కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూసిన ఆసియా కప్ 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ విజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టును టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. నిర్ణీత 19.5 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 147 పరుగులకు ఆలవుట్ అయింది. టీమ్ ఇండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్డ్, హార్దిక్ పాండ్యాలు అద్భుతంగా రాణించారు. భువనేశ్వర్ కుమార్ 26 పరుగులిచ్చి..4 వికెట్లు పడగొట్టగా..హార్దిక్ పాండ్యా 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అటు అర్షదీప్ 2 వికెట్లు ఆవేశ్ ఖాన్ 1 వికెట్ సాధించారు. చివరి ఓవర్లలో పాకిస్తాన్ ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ స్కోరు 147 పరుగులకు చేరుకోగలిగింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ అవుటవడంతో పాకిస్తాన్ భారీ స్కోరు ఆశలు నీరుగారిపోయాయి.


ఆ తరువాత 148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియాకు తొలి ఓవర్ రెండవ బంతికే షాక్ తగిలింది. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నసీమ్ షా బంతికి డకౌట్ అయ్యాడు. ఆ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ జాగ్రత్తగా ఆడుతుండగా..8.3 ఓవర్ల వద్ద 51 పరుగుల స్కోర్ ఉండగా..రోహిత్ శర్మ అవుటవడం ఇండియాకు మరో షాక్.కోహ్లి అవుటైన కాస్సేపటికి విరాట్ కోహ్లీ 35 పరుగులకు అవుటయ్యాడు. ఆ తరువాత 89 పరుగుల వద్ద 14.2 ఓవర్లకు సూర్య కుమార్ యాదవ్..నసీమ్ షా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 


ఆ తరువాత హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఇన్నింగ్స్ నిలబెట్టారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా రాణించడమే కాకుండా..చివర్లో కాస్త ధాటిగా ఆడటంతో టీమ్ ఇండియాకు విజయానికి చేరువైంది. పది బంతుల్లో 19 పరుగులు సాధించాల్సి ఉండగా..హార్దిక్ పాండ్యా వరుసగా రెండు బౌండరీలు కొట్టడంతో 8 బంతులకు 11 పరుగులు అవసరమయ్యాయి. అదే ఓవర్‌లో మరో బౌండరీ రావడంతో ఇక చివరి ఓవర్ కు 7 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌లో రవీంద్ర జడేజా అవుటయ్యాక..3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్ పాండ్యా చివరి బంతికి సిక్సర్ కొడ్డటంతో విజయం ఖాయమైంది. 


Also read: IND vs PAK T20I Live Updates: మరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. ఆసిఫ్ అలీ ఔట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook