Asia Cup 2022: మెగా టోర్నీ సందడి మొదలు..వైరల్‌గా మారిన రోహిత్ శర్మ వీడియో..!
Asia Cup 2022: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లు భారత అభిమానులను అలరిస్తున్నాయి. త్వరలో మరో మెగా టోర్నీ ప్రారంభంకానుంది.
Asia Cup 2022: వెస్టిండీస్‌లో టీమిండియా టూర్ ముగిసింది. ఈనెలాఖరుకు ఆసియా కప్-2022 సమరం మొదలు కానుంది. అంతకంటే ముందు జింబాబ్వేలో యువ భారత్ పర్యటించనుంది. టూర్‌లో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఆ తర్వాత వెంటనే ఆసియా కప్ ప్రారంభమవుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్ దయాది దేశం పాక్‌తో భారత్ తలపడనుంది. ఆగస్టు 28న ఈ ఫైట్ జరుగుతుంది. దాయాదుల మధ్య హైఓల్టేజీ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే వేడి మొదలైంది.
ఇందులో భాగంగా టోర్నీని ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ ఓ ఆసక్తికర ప్రోమోను అభిమానులతో పంచుకుంది. ప్రొమోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..పాక్‌తో ఫైట్‌కు సిద్ధమంటూ సైగలు చేసే సీన్ కనిపిస్తుంది. క్రికెట్‌లో భారత్-పాక్‌ను ఎంతో అనుబంధం ఉందని..పాక్ జట్టులోనూ మంచి ప్లేయర్లు ఉన్నారని ప్రోమోలో రోహిత్ వివరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈసారి 8వ కప్‌ను సాధించాలని పట్టుదలతో ఉంది.
స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెడ్ అవుతోంది. నెటిజన్లు సైతం తెగ కామెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. ఇందులో క్రికెట్ అభిమానులకు సందేశం ఇస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇండియా..ఇండియా అంటూ నినదించడం కనిపించింది. ఈసారి ఆసియా కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగాలని అభిమానులకు పిలుపునిచ్చాడు రోహిత్.
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా రఫాడించింది. వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగా..టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది. అంతకముందు ఇంగ్లండ్ గడ్డపైనా భారత్ జోరు కొనసాగింది. టెస్ట్ సిరీస్ సమం అయినా..వన్డే, టీ20 సిరీస్‌లను సాధించింది. దీంతో వన్డే, టీ20ల్లో భారత జట్టు ర్యాంకింగ్స్ మెరుగుపడింది.
Also read:Muralidhar Rao: త్వరలో టీఆర్ఎస్‌లో భూకంపం..గులాబీ దళంపై మురళీధర్‌రావు హాట్ కామెంట్స్..!
Also read:Viral Video: గాలిలోనే హెలికాప్టర్ నుంచి పులప్స్..గిన్నిస్ ప్రపంచ రికార్డు బద్దలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook