Asia Cup 2022: కేఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్ బెటర్..భారత మాజీ పేసర్ హాట్ కామెంట్స్..!
Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఐతే కీలక ఆటగాళ్లు ఫామ్ అందుకోవడం లేదు. ఈనేపథ్యంలో భారత మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup 2022: టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై సీనియర్ ఆటగాళ్లు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అతడి ఆట చూస్తుంటే ఏం చేయలేడనిపిస్తోందన్నాడు భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్. కేఎల్ రాహుల్ బదులుగా యువ ప్లేయర్ రిషబ్ పంత్‌ను ఆడించాలన్నాడు. పంత్ మ్యాచ్ విన్నర్ అని స్పష్టం చేశాడు. అతడిని జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. దినేష్ కార్తీక్ లేదా కేఎల్ రాహుల్‌ను పక్కకు పెట్టి పంత్‌ను ఆడించాలన్నాడు ఆర్పీ సింగ్.
అతడు ఆడితే భారత్ సులువుగా గెలుస్తుందని తెలిపాడు. రాహుల్ ఆడతాడని తనకు అనిపించడం లేదని..తన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏం చేయలేదని అనిపిస్తోంది తెలిపాడు ఆర్పీ సింగ్. కేఎల్ రాహుల్‌కు మరింత సమయం కావాలని..గాయం నుంచి కోలుకున్నాక టైమింగ్ కోల్పోయాడని..మ్యాచ్ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నాడని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆసియాకప్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సరిగా ఆడటం లేదు.
దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. 39 బంతుల్లో 36 పరుగులు చేశాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నా..కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అంతకుముందు జింబాబ్వే టూర్‌లోను అలరించలేకపోయాడు కేఎల్ రాహుల్. అతడి కెప్టెన్సీలో భారత్‌కు సిరీస్ దక్కినా..అతడి ఫామ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ భారత ఆటగాళ్లు మాత్రం అతడికే సపోర్ట్ ఇస్తున్నారు. కేఎల్ రాహుల్ కీలక ఆటగాడు అని..త్వరలో ఫామ్ అందుకుంటాడని చెబుతున్నారు.
మరోవైపు ఆసియా కప్‌లో భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్-4కు దూసుకెళ్లింది. రేపు(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. సూపర్-4లో మొత్తం మూడు మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. ఇందులో టాప్‌లో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లనున్నాయి. టీమిండియా జోరు చూస్తుంటే ఫైనల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ సైతం అదే జోరులో ఉంది. దాయది దేశాలే మళ్లీ ఫైనల్‌లో తలపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
[[{"fid":"243881","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి