Fastest Victories in History: వన్డే చరిత్రలో ఇంతకు ముందు ఎవరెవరు ఇంత వేగంగా మ్యాచ్ గెలిచారో తెలుసా ?
Siraj Mohammad Reminds Us Fastest Victories in ODI History: ఆసియా కప్ 2023 పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇలా శరవేగంగా వన్డే మ్యాచ్ గెలిచిన జట్లపై ఓ స్మాల్ ఫోకస్...
Siraj Mohammad Reminds Us Fastest Victories in ODI History: 1979 లో కెనడాపై ఇంగ్లాండ్ జట్టు 277 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పట్లో ఇంగ్లాండ్ సాధించిన ఈ ఘన విజయం ఆ తరువాత కొన్ని దశాబ్ధాల వరకు అసాధ్యంగానే మిగిలిపోయింది.
శ్రీలంక , జింబాబ్లే జట్ల మధ్య 2001 లో జరిగిన వన్డే మ్యాచ్‌లో 274 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ ఆటలో జింబాబ్వేను శ్రీలంక చిత్తుచిత్తుగా ఓడించింది.
శ్రీలంక vs కెనడా జట్ల మధ్య 2003 లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఈసారి శ్రీలంక ఊచకోత బారినపడటం కెనడా వంతయ్యింది. 272 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో కెనడాపై గెలిచి వన్డేల్లో తామే పులులం అని లంక ఆటగాళ్లు ప్రూవ్ చేసుకున్నారు.
2020 లో జరిగిన ఒక మ్యాచ్ లో అమెరికాపై నేపాల్ జట్టు 268 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలిచి అంతర్జాతీయ మ్యాచుల్లో తాము కూడా ఉన్నాం అంటూ తమ సత్తా చాటుకుంది.
న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ జట్ల మధ్య 2007 లో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ చెలరేగిపోయి తమ విశ్వరూపం చూపించింది. 264 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టుని చిత్తు చేసి పెవిలియన్ కి పంపించింది. వన్డే మ్యాచుల్లో ఒక జట్టు తమ ప్రత్యర్థి జట్టును ఊచకోత కోసిన మ్యాచుల్లో ఇది కూడా ఒకటి.
ఆసియా కప్ 2023 పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ విజయం టీమిండియాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
నేపాల్ జట్టు 2023 లోనూ తమ దూకుడు కొనసాగించింది. పీఎన్జీ జట్టుపై 254 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో నేపాల్ గెలుపొందింది. నేపాల్ జట్టుకు ఇది మరొక మెమొరబుల్ విన్నింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని మిగిల్చింది.
2004 లో ఆస్ట్రేలియా vs అమెరికా జట్ల మధ్య 2004 లో జరిగిన వన్డే మ్యాచ్ పోటీలో అమెరికాపై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో 253 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
2011 లో న్యూజిలాండ్ vs కెన్యా దేశాల మధ్య జరిగిన వన్డే పోరులో న్యూజిలాండ్ చెలరేగిపోయింది. 10 వికెట్ల తేడాతో 252 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ విజయం సాధించింది.
2015 లో న్యూజిలాండ్ vs శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ మళ్లీ అదే సీన్ రిపీట్ చేసి నాలుగేళ్ల తరువాత కూడా తమ సత్తాలో ఏ మాత్రం తేడా రాలేదని చాటుకుంది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో 250 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది.