Asia Cup 2023 Points Table: అదే జరిగితే ఆసియా కప్ నుంచి పాక్ ఔట్.. భారత్‌ను ఫైనల్లో ఢీకొట్టాలంటే లెక్కలు ఇవే..!
Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దాయాదుల మధ్య సమరం జరగాలంటే.. శ్రీలంకను పాకిస్థాన్ ఓడించాలి. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది..? లెక్కలు ఇలా..!
Asia Cup 2023 Final: వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఫుల్ జోష్‌లోకి వచ్చింది. వరుస విజయాలతో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో వేదికగా జరిగిన రెండో సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సోమవారం 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది రోహిత్ శర్మ సేన. చివరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నామమాత్రంగా మారింది. సూపర్ 4 దశలో 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో టీమిండియా 4 పాయింట్లు, నెట్ రన్-రేట్ 2.690తో టాప్ ప్లేస్‌లో ఉంది.
శ్రీలంకపై భారత్ విజయం సాధించడంతో ఆసియాకప్ ఫైనల్ రేసు నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. బంగ్లా 2 మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. సెప్టెంబర్ 17న జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ పోరు జరగనుంది. ఇక టీమిండియా-పాక్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగాలంటే సమీకరణాలు ఎలా ఉండాలి..? పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిద్దాం.
సూపర్-4 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం శ్రీలంక ఒక విజయంతో 2 పాయింట్లు, -0.200 నెట్ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. భారత్ చిత్తు చేతిలో చిత్తుగా ఓడిన బాబర్ అజామ్ సేన నెట్ రన్‌రేట్ బాగా పడిపోయింది. బంగ్లాదేశ్‌పై విజయంతో 2 పాయింట్లు, -1.892 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. సూపర్ 4 దశలోని ఐదో మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. నేరుగా ఫైనల్‌కు చేరుకుని భారత్‌తో తలపడనుంది.
అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. పాకిస్థాన్‌కు జట్టుకు గట్టి ఎదురుదెబ్బే తగలనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. దీంతో ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ను క్యాన్సిల్ చేస్తే.. చెరో పాయింట్‌ను పంచుకుంటాయి. మెరుగైన రన్ రేట్‌తో శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు
Also Read: Kishan Reddy: ఆయన ఎప్పుడో పెట్రోల్ పోసుకున్నాడు.. అగ్గిపెట్టే ఇంకా దొరకలేదు: కిషన్ రెడ్డి సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook