ఆసియా క్రీడలు 2018: భారత్కి మరో గోల్డ్ మెడల్

భారత్కి మరో స్వర్ణ పతకం
ఆసియా క్రీడలు 2018ల్లో భారత్ వెంటనే మరో స్వర్ణ పతకం గెల్చుకుంది. 14వ రోజు పోటీల్లో భాగంగా నేడు జరిగిన బ్రిడ్జ్ ఫైనల్ ఈవెంట్‌లో భారత్ తరపున పోటీపడిన ప్రణబ్ బర్థన్, శివ్‌నాథ్ సర్కార్ గోల్డ్ మెడల్ గెల్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు జరిగిన ఆసియా క్రీడలు 2018లో భారత్ సొంతం చేసుకున్న బంగారు పతకాల సంఖ్య 15కు చేరుకుంది.