KL Rahul-Athiya Shetty: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి అతియా శెట్టి(Athiya Shetty). ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘'హ్యపీ బర్త్‌డే మై లవ్’' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి అసలు విషయం తెలిపాడు. గతంలో వీరిద్దరూ లవర్స్ అనే రూమర్స్ నెట్టింట తెగ చక్కెర్లు కొట్టిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021)లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా(Teamindia) తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియాకు స్కాట్లాండ్‌పైన అదే జోరును కొనసాగించింది. స్కాట్లాండ్(Scotland)తో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి..భారత్ కు విజయాన్ని అందించాడు. తద్వారా టీ20 ప్రపంచ కప్ 2021లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని సాధించాడు. కేఎల్ రాహుల్(KL Rahul) తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 263.16గా నమోదైంది. 


Also read: T20 WC 2021 India vs Scotland: టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన...స్కాట్లాండ్​పై భారత్ గెలుపు


కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ తర్వాత, నటి అతియా శెట్టి ఫోటో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యింది. ఎందుకంటే ఈ రోజు ఆ నటి పుట్టినరోజు కూడా. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ మైదానంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి మంచి బహుమతిని అందించాడు. అద్భుతమైన అర్ధ సెంచరీ, టీమ్ ఇండియా భారీ విజయం తర్వాత కేఎల్ రాహుల్ స్నేహితురాలు అతియా శెట్టి(Athiya Shetty)కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీని క్యాప్షన్ చాలా కూడా ప్రత్యేకంగా అందించాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మై లవ్. (లవ్ ఎమోజీ) అతియా శెట్టిని తాను ప్రేమిస్తున్నానని రాహుల్ సోషల్ మీడియాలో మొదటిసారి అంగీకరించాడు.



 


ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ(Fastest half century) సాధించిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ మూడో ర్యాంక్‌ సాధించాడు. 2007లో ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు. 2014లో స్టీఫెన్ మైబర్గ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, గ్లెన్ మాక్స్‌వెల్, కేఎల్ రాహుల్ 18 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి