దాయాది దేశం పాకిస్థాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.  భారతదేశం- పాకిస్థాన్ మధ్య తటస్థ వేదికపై కూడా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరిగే అవకాశం లేదని సుష్మా స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రిత్వశాఖ యొక్క సంప్రదింపుల కమిటీ సమావేశంలో, పాకిస్థాన్ సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడుతోందని.. కాల్పులకు తెగబడుతోందని.. ఇలాంటి అననుకూల వాతావరణంలో క్రికెట్ దౌత్యం సరైందికాదు" అని అన్నారు. అయితే ఖైదీల మార్పిడి లాంటి మానవతా ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు. ఇస్లామాబాద్లో కుల్భూషణ్ జాధవ్ భార్య మరియు తల్లి, కాల్పుల ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ వాటిని పెడచెవిన పెట్టిందని దాంతో ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయని అన్నారు.  


భారతదేశం 2007 నుండి పాకిస్థాన్ తో పూర్తి ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. డిసెంబరు 2012లో ద్వైపాక్షిక క్రికెట్ లో భాగంగా పాకిస్థాన్ జట్టు భారతదేశంలో పర్యటించి రెండు వన్డే, రెండు టీ20 మ్యాచ్ లను ఆడింది.  సరిహద్దు వద్ద పెరుగుతున్న హింసాకాండల నేపథ్యంలోనే  ద్వైపాక్షిక క్రికెట్ ను ఆపేస్తున్నామని మంత్రి చెప్పారు. గ్రూప్ టోర్నమెంట్ లోనూ భారత్, పాక్ జట్లను ఒకే గ్రూప్ లో ఉంచరాదని బీసీసీఐ బోర్డు ఐసీసీని కోరింది.